'మయసభ'లో చైతన్య కాదు!

అక్కినేని నాగచైతన్య ప్రస్తుతం కార్తీక్ దండు దర్శకత్వంలో రూపొందుతున్న ఓ మిస్టిక్ థ్రిల్లర్ సినిమాలో నటిస్తున్నాడు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో చైతూ సరికొత్త లుక్‌తో కనిపించనున్నాడని సమాచారం. ఇప్పటికే ఈ సినిమాపై అభిమానుల్లో భారీ స్థాయిలో ఆసక్తి ఏర్పడింది.
ఇదిలా ఉండగా, నాగచైతన్య మరో చిత్రం ‘మయసభ’లో కూడా నటిస్తున్నాడని ఇటీవల సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే, దర్శకుడు దేవా కట్టా దీనిపై స్పందిస్తూ, ఈ ప్రచారాన్ని ఖండించాడు. ‘మయసభ’ చిత్రంలో హీరోగా ఆది పినిశెట్టి నటించాడని, ఇంకా చైతన్య రావు, సాయికుమార్, నాజర్, దివ్య దత్తా, తాన్య రవిచంద్రన్, రవీందర్ విజయ్, శ్రీకాంత్ అయ్యంగార్, శత్రు వంటి నటులు నటించారని క్లారిటీ ఇచ్చాడు.
ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ త్వరలో రిలీజ్ కానుందని సోషల్ మీడియా వేదికగా తెలిపాడు దేవా కట్టా. ఇందులో నటించిన చైతన్య రావు అనే నటుడిని అక్కినేని నాగచైతన్యగా పొరపాటుగా భావించారని ఆయన స్పష్టం చేశాడు. దేవా కట్టా తనదైన కథా శైలిలో 'మయసభ'తో మళ్లీ ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్ధమయ్యాడు. అయితే ఇది సినిమాయా? వెబ్ సిరీసా? అనే దానిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. మరోవైపు నాగచైతన్య-దేవా కట్టా కలయికలో పదేళ్ల క్రితమే 'ఆటోనగర్ సూర్య' సినిమా వచ్చింది.
Small clarification; #MAYASABHA shoot is COMPLETED and is in final sound mix. The main cast is Aadhi Pinishetty, Chaitanya Rao, Saikumar, Nasser, Divya Dutta, Tanya Ravichandran, Ravindra Vijay, Srikanth Iyengar and Shatru etc.!! Some misquoting @chay_akkineni for Chaitanya Rao!…
— deva katta (@devakatta) April 26, 2025
-
Home
-
Menu