పద్మభూషణుడికి 'అఖండ 2' టీమ్ ఘన సత్కారం!

X
పద్మభూషణుడిగా మారిన తర్వాత తన 'అఖండ 2' సెట్స్ లోకి ఎంటరయ్యాడు బాలయ్య. ఈ సందర్భంగా చిత్రబృందం నుంచి ఆయనకు ఘన స్వాగతం లభించింది. 'అఖండ 2' టీమ్ అంతా బాలయ్యను కంగ్రాట్యులేట్ చేశారు.
పద్మభూషణ్, నటసింహం నందమూరి బాలకృష్ణకు 'అఖండ 2' టీమ్ అదిరిపోయే రేంజులో స్వాగతం పలికింది. తాజాగా కేంద్ర ప్రభుత్వం గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణకు పద్మభూషణ్ ప్రకటించిన విషయం తెలిసిందే. పద్మభూషణుడిగా మారిన తర్వాత తన 'అఖండ 2' సెట్స్ లోకి ఎంటరయ్యాడు బాలయ్య. ఈ సందర్భంగా చిత్రబృందం నుంచి ఆయనకు ఘన స్వాగతం లభించింది. 'అఖండ 2' టీమ్ అంతా బాలయ్యను కంగ్రాట్యులేట్ చేశారు.
సూపర్ హిట్ మూవీ 'అఖండ'కి సీక్వెల్ గా 'అఖండ 2' రూపొందుతుంది. మాస్ స్పెషలిస్ట్ డైరెక్టర్ బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్న ఈ సినిమాని 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్నారు. తమన్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. దసరా కానుకగా సెప్టెంబర్ లో 'అఖండ 2' ఆడియన్స్ ముందుకు రానుంది.
Next Story
-
Home
-
Menu