సంజయ్ లీలా పై కేసు నమోదు

ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీపై రాజస్థాన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదైంది. జోధ్‌పూర్‌కు చెందిన రాధా ఫిల్మ్స్ అండ్ హాస్పిటాలిటీ సీఈఓ ప్రతీక్ రాజ్ మాథూర్ సంజయ్ పై ఫిర్యాదు చేశారు. భన్సాలీ తెరకెక్కిస్తున్న ‘లవ్ అండ్ వార్‘ చిత్రానికి తనను లైన్ ప్రొడ్యూసర్‌గా నియమించుకున్నప్పటికీ, చెల్లింపులు చేయకపోగా తనను అవమానించి బెదిరించారని ఆయన ఫిర్యాదులో ఆరోపించారు.
ఆగస్టులో బికనీర్‌లో జరిగిన షూటింగ్ సమయంలో ప్రభుత్వ అనుమతులు, భద్రతా ఏర్పాట్లు తానే చూసుకున్నానని, కానీ తర్వాత తనను పక్కనబెట్టారని మాథూర్ తెలిపారు. అలాగే ఆగస్టు 17న నరేంద్రభవన్ హోటల్‌లో భన్సాలీ, ఆయన ప్రొడక్షన్ మేనేజర్లు ఉత్తకర్ష్ బాలి, అర్వింద్ గిల్ తనను తేసేసి దురుసుగా ప్రవర్తించారని పేర్కొన్నారు.
మొదట పోలీసులు కేసు నమోదు చేయకపోయినా, కోర్టు ఆదేశాల మేరకు బికనీర్‌లోని బిచ్వాల్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది. గతంలో ‘పద్మావత్‘ సినిమా కంటెంట్ విషయంలో సంజయ్ లీలా భన్సాలీపై కేసులు నమోదైన సంగతి తెలిసిందే. రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్, విక్కీ కౌశల్ ప్రధాన పాత్రల్లో ‘లవ్ అండ్ వార్‘ సినిమా రూపొందుతుంది. ఈ ఏడాది డిసెంబర్ లో ఈ చిత్రం ఆడియన్స్ ముందుకు రావాల్సి ఉంది.
-
Home
-
Menu