సుష్మా స్వరాజ్ కుమార్తె తో బన్నీ వాసు భేటీ.. కారణమేంటి!

నాగచైతన్య, సాయిపల్లవి హీరోహీరోయిన్లుగా రూపొందిన చిత్రం 'తండేల్'. ఫిబ్రవరి 7న ఈ సినిమా పాన్ ఇండియా రిలీజ్ కు రెడీ అయ్యింది. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటికే ఈ మూవీ ప్రమోషన్స్ జోరందుకున్నాయి. ఈరోజు ఈ మూవీ హిందీ ట్రైలర్ ను బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ లాంఛ్ చేస్తున్నాడు.
చందూ మొండేటి దర్శకత్వం వహించిన ఈ రొమాంటిక్ డ్రామా 2018లో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందించబడింది. 2017-2018 కాలంలో పాకిస్థానీ జైళ్లలో చిక్కుకుపోయిన భారతీయ మత్స్యకారులను వెనక్కి తీసుకురావడంలో అప్పటి కేంద్రమంత్రి సుష్మా స్వరాజ్ కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే.
తాజాగా దివంగత మాజీ కేంద్రమంత్రి సుష్మా స్వరాజ్ కూతురు బన్సూరి స్వరాజ్‌ను నిర్మాత బన్నీ వాసు కలుసుకున్నారు. 'తండేల్' చిత్రం టైటిల్ కార్డ్స్‌లో సుష్మా స్వరాజ్ పేరును చేర్చేందుకు బన్సూరి స్వరాజ్ అనుమతినిచ్చారు. దీనికి బన్నీ వాసు ఆమెకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
-
Home
-
Menu