మరోసారి చర్చల్లోకి బన్నీ-కొరటాల ప్రాజెక్ట్!

'పుష్ప 2' భారీ విజయంతో ఫుల్ జోష్ లో ఉన్న అల్లు అర్జున్.. తన తర్వాతి సినిమా విషయంలో తీవ్ర కసరత్తులు చేస్తున్నాడు. ఇప్పటికే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ను కన్ఫమ్ చేశాడు. అయితే బన్నీ-త్రివిక్రమ్ సినిమా పట్టాలెక్కడానికి కాస్త సమయం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఈలోపులో మరికొన్ని సినిమాలను లైన్లో పెట్టేందుకు కథలు వింటున్నాడట బన్నీ. ఈకోవలోనే బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సంజయ్ లీల భన్సాలీతోనూ కథా చర్చలు సాగిస్తున్నాడు. అందుకోసం ఆమధ్య ప్రత్యేకంగా ముంబై వెళ్లాడు. మరోవైపు టాలీవుడ్ డైరెక్టర్ కొరటాల శివతోనూ అల్లు అర్జున్ సినిమా చేసే ఛాన్స్ ఉందనేది ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తున్న మాట.
అసలు 'పుష్ప' కంటే ముందే బన్నీ-కొరటాల కాంబోలో సినిమా తెరకెక్కాల్సి ఉంది. కొన్ని అనివార్య కారణాలతో వీరి ప్రాజెక్ట్ ఆగిపోయింది. మళ్లీ ఇప్పుడు ఐకాన్ స్టార్ కోసం ఓ అదిరిపోయే స్టోరీతో సిద్ధమవుతున్నాడట కొరటాల శివ. ఆద్యంతం ఉత్తర ప్రదేశ్ నేపథ్యంలో ఓ పాన్ ఇండియా స్టోరీని రెడీ చేస్తున్నాడట. ఆ లైన్ బన్నీకి కూడా బాగా నచ్చినట్టు తెలుస్తోంది. అన్నీ ఓ.కె. అయితే త్వరలోనే కొరటాల మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నాడట అల్లు అర్జున్.
-
Home
-
Menu