చుట్టమల్లే’ వైరల్ అయిన బ్రిటీష్ పాప్ సింగర్ !

చుట్టమల్లే’ వైరల్ అయిన బ్రిటీష్ పాప్ సింగర్ !
X

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘దేవర’ చిత్రంలోని ‘చుట్టమల్లే’ పాట ఎంతటి సంచలనాన్ని సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ పాట విడుదలైన నాటి నుండి సోషల్ మీడియాను ఊపేస్తూనే ఉంది. తాజాగా.. ఈ పాటను ప్రముఖ బ్రిటిష్ పాప్ సింగర్ ఎడ్వర్డ్ క్రిస్టోఫర్ షీరన్ ఆలపించాడు. ఈ వీడియో క్షణాల్లోనే వైరల్ అయింది.

బెంగళూరులో ఇటీవల నిర్వహించిన తన కాన్సర్ట్‌లో ఎడ్ షీరన్ ‘చుట్టమల్లే’ పాటను పాడి అక్కడి ప్రేక్షకులను ఉత్సాహంతో ఉరకలెత్తించాడు. ఓ అంతర్జాతీయ గాయకుడు తెలుగు పాటను పాడడం చూసి అభిమానులు ఆశ్చర్యపోయారు. దీనిపై ఎన్టీఆర్ స్పందిస్తూ, “సంగీతానికి ఎల్లలు ఉండవు. మీరు దీన్ని మరోసారి నిరూపించారు. మీ గొంతులో ‘చుట్టమల్లే’ వినడం ఓ ప్రత్యేకమైన అనుభూతి” అంటూ షీరన్‌కు కృతజ్ఞతలు తెలిపాడు.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘దేవర’ చిత్రం సూపర్ హిట్‌గా నిలిచింది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ డ్రామా ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లు సాధించింది. ముఖ్యంగా ఇందులోని పాటలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ‘చుట్టమల్లే’ పాట సోషల్ మీడియాలో ట్రెండ్‌గా మారి లక్షల కొద్ది రీల్స్‌ను తెచ్చుకుంది.

ఇక ‘దేవర’ సీక్వెల్‌కు సంబంధించిన అధికారిక సమాచారం త్వరలో వెలువడనుంది. దర్శకుడు కొరటాల శివ వెల్లడించిన వివరాల ప్రకారం, మొదటి భాగంలో కథలోని కేవలం 10 శాతం మాత్రమే చూపించామని, రెండో భాగం 100 శాతం పవర్‌ఫుల్‌గా ఉంటుందని తెలిపారు

Tags

Next Story