అవును.. ఆమిర్ ఖాన్ ఈమెను ఇష్టపడ్డాడు !

బాలీవుడ్ స్టార్ హీరో ఆమీర్ ఖాన్ తన ప్రేమాయణాన్ని అధికారికంగా ధృవీకరించాడు. తన 60వ పుట్టినరోజు సందర్భంగా ముంబైలో జరిగిన వేడుకలో గౌరి స్ప్రాట్‌తో ఒక సంవత్సరం నుంచి ప్రేమలో ఉన్నానని వెల్లడించాడు. ఆమీర్ ఖాన్ కు గౌరి గత 25 ఏళ్లుగా తెలుసు. ఆమె ప్రస్తుతం బెంగళూరులో నివసిస్తూ, ఆయన నిర్మాణ సంస్థలో పని చేస్తోంది. గౌరి తల్లి తమిళియన్, తండ్రి ఐరిష్ వంశస్తుడు. ఆమె తాత స్వాతంత్ర్య సమరయోధుడు. గౌరి ఇప్పుడు ఆరేళ్ల కొడుకు ఉన్నాడు.
ఆమీర్ ఖాన్ గౌరి గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. గౌరి తాను నటించిన చాలా సినిమాలు చూడలేదని, ‘లగాన్’, ‘దంగల్’ వంటి కొన్ని మాత్రమే చూసిందని చెప్పాడు. ఇటీవల జరిగిన తన జన్మదిన వేడుకలో షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్‌కు గౌరిని పరిచయం చేశాడు ఆమిర్ ఖాన్.
ఆమీర్ ఖాన్ తన రెండో భార్య కిరణ్ రావుతో 2021లో విడాకులు తీసుకున్నాడు. ఆ ఇద్దరికీ ఆజాద్ రావ్ ఖాన్ అనే కుమారుడు ఉన్నాడు. అంతకుముందు, రీనా దత్తాను వివాహం చేసుకున్న ఆమీర్ ఖాన్‌కు జునైద్ ఖాన్, ఐరా ఖాన్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు.
-
Home
-
Menu