‘రామాయణం’ షూటింగ్ కోసం యశ్ !

‘రామాయణం’ షూటింగ్ కోసం యశ్ !
X
తాజా సమాచారం ప్రకారం.. "టాక్సిక్" సినిమా పెద్ద షెడ్యూల్‌ను పూర్తి చేసిన యశ్.. ఇప్పుడు ముంబైలో ‘రామాయణం’ సెట్స్‌పైకి అడుగుపెట్టనున్నాడు.

నితేశ్ తివారి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రామాయణం’ సినిమా ఇండియన్ సినిమా చరిత్రలోనే అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రాల్లో ఒకటి. దర్శకుడు నితేశ్ తివారి, నిర్మాత నమిత్ మల్హోత్రా కలిసి యశ్, రణబీర్ కపూర్, సన్నీ డియోల్, సాయిపల్లవి లాంటి గొప్ప నటులను ఒకే ఫ్రేములోకి తీసుకురావడం నిజంగా చాలా గ్రేట్.

ఈ వారం నుండి ముంబైలో ‘రామాయణం’ షూటింగ్ ప్రారంభించడానికి యశ్ సిద్ధమవుతున్నాడు. ఈ సినిమాలో రావణుడి పాత్రను పోషించనున్న యశ్, నమిత్ మల్హోత్రాతో కలిసి ఈ సినిమాను సహ నిర్మాతగానూ నిర్మిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం.. "టాక్సిక్" సినిమా పెద్ద షెడ్యూల్‌ను పూర్తి చేసిన యశ్.. ఇప్పుడు ముంబైలో ‘రామాయణం’ సెట్స్‌పైకి అడుగుపెట్టనున్నాడు. ప్రతీ కొత్త ప్రాజెక్ట్‌ను ఒక దేవాలయ దర్శనంతో ప్రారంభించే యశ్, ఈసారి ఉజ్జయినిలోని శ్రీ మహాకాళేశ్వర ఆలయాన్ని సందర్శించనున్నాడని తెలుస్తోంది.

ఈ షెడ్యూల్‌లో యశ్ ఒంటరిగా పాల్గొనబోయే కొన్ని కీలక సన్నివేశాలను షూట్ చేయనున్నారు. యశ్ కు ప్రత్యేకంగా ఓ సెట్‌ను నిర్మించి.. పాన్ ఇండియా హీరోగా అతడ్ని ఘనంగా స్వాగతించేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నారు. ‘రామాయణం’ సినిమాను అత్యాధునిక సాంకేతికతతో ఒక దృశ్య వైభవంగా రూపొందిస్తున్నారు. ఈ మొదటి షెడ్యూల్‌లో యశ్ ప్రధానంగా కొన్ని అత్యద్భుతమైన విజువల్ సన్నివేశాల షూటింగ్ చేస్తాడు. ఏప్రిల్ చివరి నుంచి సుమారు నెల రోజుల పాటు యశ్ షూటింగ్‌లో పాల్గొంటాడు. అనంతరం మళ్ళీ ‘టాక్సిక్’ మూవీపై దృష్టి సారించనున్నాడు.

రామాయణంను రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. మొదటి భాగం 2026 దీపావళికి, రెండవ భాగం 2027 దీపావళికి విడుదల కానుంది. రావణుడిగా యాష్, రాముడిగా రణబీర్ కపూర్ మధ్య జరిగే ఈ మహాసమరానికి ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. లార్డ్ హనుమాన్ పాత్రలో సన్నీ డియోల్ జూన్ నుంచి షూటింగ్‌లో చేరనున్నారు.

Tags

Next Story