‘రామాయణం’ షూటింగ్ లో యష్ బిజీ బిజీ

‘రామాయణం’ షూటింగ్ లో యష్ బిజీ బిజీ
X
ప్రస్తుతం రావణుడు పాత్రధారి యష్ పై ఉత్కంఠభరితమైన యుద్ధ సన్నివేశాలను చిత్రీకరిస్తోంది. ఈ యాక్షన్ సన్నివేశాలను అత్యంత భారీ స్థాయిలో, అత్యాధునిక విజువల్ ఎఫెక్ట్స్‌తో రూపొం దిస్తున్నారు.

రణ్‌బీర్ కపూర్ నటిస్తున్న మోస్ట్ ఎవైటింగ్ మైథలాజికల్ మూవీ ‘రామాయణం’ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. నితేష్ తివారీ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో కన్నడ యంగ్ సూపర్‌స్టార్ యష్ రావణుడి పాత్రలో నటిస్తూ సినిమాకు మంచి మైలేజ్ ఇవ్వబోతున్నాడు. ఈ చిత్రం భారతీయ సినిమా రంగంలో పౌరాణిక కథల చిత్రీకరణకు కొత్త ప్రమాణాలను నెలకొల్పనుందని అంచనా వేస్తున్నారు.

తాజా సమాచారం ప్రకారం... చిత్ర యూనిట్ ప్రస్తుతం రావణుడు పాత్రధారి యష్ పై ఉత్కంఠభరితమైన యుద్ధ సన్నివేశాలను చిత్రీకరిస్తోంది. ఈ యాక్షన్ సన్నివేశాలను అత్యంత భారీ స్థాయిలో, అత్యాధునిక విజువల్ ఎఫెక్ట్స్‌తో రూపొం దిస్తున్నారు. ఈ సన్నివేశాలు ప్రేక్షకులకు ఒక అద్భుతమైన దృశ్య అనుభవాన్ని అందించేలా రూపొందుతున్నాయని టాక్. సాంకేతికంగా ఉన్నత ప్రమాణాలతో, ప్రతి ఫ్రేమ్‌ను జాగ్రత్తగా తీర్చిదిద్దడానికి బృందం కఠినంగా శ్రమిస్తోంది.

ఈ చిత్రంలో రణ్‌బీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయి పల్లవి సీతగా నటిస్తున్నారు. వీరితో పాటు బలమైన తారాగణం ఈ సినిమాకు మరింత బలాన్ని చేకూర్చనుంది. రామాయణం కథను ఆధునిక సాంకేతికతతో, భావోద్వేగ సన్నివేశాలతో కూడిన ఒక గొప్ప సినిమాటిక్ అనుభవంగా అందించేందుకు చిత్ర బృందం ఎటువంటి రాజీ లేకుండా కసరత్తు చేస్తోంది. ఈ చిత్రం భారతీయ సినిమా పరిశ్రమలో పౌరాణిక కథల చిత్రీకరణలో ఒక కొత్త అధ్యాయాన్ని లిఖించనుందని అందరూ ఆశిస్తున్నారు.

Tags

Next Story