బాలీవుడ్ చిత్రం ‘రేస్ 4’ లో విలన్ ఎవరు?

బాలీవుడ్ చిత్రం ‘రేస్ 4’ లో విలన్ ఎవరు?
X

బాలీవుడ్‌లో హై-ఓల్టేజ్ యాక్షన్ ఫ్రాంచైజీగా పేరు తెచ్చుకున్న "రేస్" సిరీస్ నాలుగో భాగానికి రంగం సిద్ధమవుతోంది. ఈ సినిమాకు సంబంధించి అనేక ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నప్పటికీ.. ఒక విషయం మాత్రం ఖచ్చితంగా తెలుస్తోంది. సైఫ్ ఆలి ఖాన్ ఈ ఫ్రాంచైజీలోకి తిరిగి రాబోతున్నాడు. అయితే, ఇతర కీలక విషయాలపై ఇప్పటికీ అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా డైరెక్టర్ ఎవరు? ఇతర తారాగణం ఎవరు? చిత్రీకరణ ఎక్కడ జరుగుతుందనేది ఇంకా స్పష్టత లేదు.

కానీ, తాజా సమాచారం ప్రకారం.. హర్షవర్ధన్ రాణే ఈ సినిమాలో ప్రధాన ప్రతినాయకుడిగా కనిపించబోతున్నాడట. "సనం తేరీ కసం" రీ-రిలీజ్‌తో హర్షవర్ధన్ రాణేకి దక్కిన అఖండ విజయంతో అతనికి భారీ ఆఫర్లు వస్తున్నాయి. వాటిలో అత్యంత క్రేజీ ప్రాజెక్ట్ "రేస్ 4" లో విలన్ పాత్ర. ఇంకా అధికారికంగా ఫైనల్ చేయలేదు కానీ, అతన్ని ఈ పాత్ర కోసం ఎంపిక చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయట.

ఇప్పటివరకు వచ్చిన రూమర్స్ ప్రకారం.. సిద్ధార్థ్ మల్హోత్రా కూడా "రేస్ 4" లో భాగమవుతాడని సమాచారం. ఈ వార్తలు నిజమైతే.. హర్షవర్ధన్, సిద్ధార్థ్ ఇద్దరూ విలన్లుగా రానున్నారా? లేక సైఫ్ అలి ఖాన్‌తో వీరిద్దరి మధ్య విపరీతమైన యాక్షన్ సన్నివేశాలు ఉండబోతున్నాయా? అన్నది ఆసక్తికరమైన ప్రశ్న. ఇక డైరెక్టర్ విషయంలోనూ మార్పులు జరిగే అవకాశం ఉంది. "రేస్ 4" ను నిఖిల్ అద్వానీ డైరెక్ట్ చేస్తారని గతంలో వార్తలు వచ్చాయి. కానీ, తాజా సమాచారం ప్రకారం, "తానాజీ" ఫేమ్ ఓం రౌత్ ఈ భారీ ప్రాజెక్ట్‌కు మెగాఫోన్ పట్టుకునే అవకాశముంది. ఇది నిజమేనని అధికారికంగా ప్రకటిస్తే, మరో భారీ అప్‌డేట్ అయినట్లే!

గతంలో వచ్చిన "రేస్ 3" చిత్రాన్ని కొరియోగ్రాఫర్-దర్శకుడు రేమో డిసౌజా తెరకెక్కించారు. ఇందులో సల్మాన్ ఖాన్, అనిల్ కపూర్, బాబీ దియోల్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, డైసీ షా, సకిబ్ సలీమ్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. మరి "రేస్ 4" లో నిజంగా హర్షవర్ధన్ రాణే విలన్ అవుతాడా? సిద్ధార్థ్ మల్హోత్రా ఇందులో భాగమవుతాడా? ఓం రౌత్ దర్శకత్వ బాధ్యతలు తీసుకుంటారా? ఈ ప్రశ్నలకు త్వరలోనే సమాధానం దొరకనుంది.

Tags

Next Story