‘వార్ 2’ లో ఆ ఫైట్ సీన్ నెవర్ బిఫోర్ అట !

‘వార్ 2’ లో ఆ ఫైట్ సీన్ నెవర్ బిఫోర్ అట !
X
ఈ చిత్రంలో ఎన్టీఆర్ ఓ షిప్‌పై వందమందితో ఒంటరిగా పోరాడే విజువల్ ఎక్స్‌ట్రావగాంజా చూడబోతున్నాం.

ఒక్కడు.. వందమందితో పోరాటం. పౌరాణిక కథలా అనిపిస్తున్నా ఇది స్ర్కీన్ పై యథార్థం కాబోతోంది. ఎందుకంటే ఆ ఒక్కడు జూనియర్ ఎన్టీఆర్ కాబట్టి. ఇప్పటికే హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కలిసి తెరపై తళుక్కుమనే యాక్షన్ థ్రిల్లర్ ‘వార్ 2’ మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. కానీ తాజాగా వచ్చిన అప్‌డేట్ అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని పెంచింది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ ఓ షిప్‌పై వందమందితో ఒంటరిగా పోరాడే విజువల్ ఎక్స్‌ట్రావగాంజా చూడబోతున్నాం.

సాధారణంగా అలాంటి సన్నివేశాలు హాలీవుడ్ సినిమాల్లో చూస్తుంటాం. కానీ ఎన్టీఆర్‌ స్టామినాతో, యాక్షన్ టైమింగ్‌తో వస్తే ఆ ఫైట్ మామూలుగా ఉండదని సినీప్రేమికులు నమ్మకంగా చెబుతున్నారు. ఆయన ఎనర్జీ, స్క్రీన్ ప్రెజెన్స్, ఫైటింగ్ స్టైల్ చూసిన వాళ్లకు ఈ యాక్షన్ సీక్వెన్స్ ఎలా ఉండబోతుందో ఊహించగలిగే స్థాయిలో ఉంది. గతంలో ‘ఆర్ ఆర్ ఆర్’ లో తన పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్‌తో ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన ఎన్టీఆర్, ఇప్పుడు బాలీవుడ్‌లో తనదైన ముద్ర వేసేలా కనిపిస్తున్నాడు.

‘వార్ 2’ వచ్చే 2025 ఆగస్టు 14 న విడుదల కానుంది. యశ్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం బాలీవుడ్ యాక్షన్ సినిమాలకు కొత్త బార్లు పెడుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. హృతిక్, ఎన్టీఆర్ కలిసి తెరను మంటపెట్టబోతున్నారు. ముఖ్యంగా ఎన్టీఆర్ తొలి బాలీవుడ్ ఎంట్రీనే ఇంత విపరీతమైన యాక్షన్ రోల్‌తో రావడం బాక్సాఫీస్‌కు వేరే లెవెల్‌లో షాక్ ఇవ్వనుంది.

Tags

Next Story