‘వార్ 2’ కు రిలీజ్ డేట్ ఫిక్స్ !

బాలీవుడ్‌లో ప్రముఖ నిర్మాణ సంస్థ.. యశ్ రాజ్ ఫిల్మ్స్ అధికారికంగా "వార్ 2" విడుదల తేదీని ప్రకటించింది. హృతిక్ రోషన్, ఎన్టీఆర్ హీరోలు గా నటిస్తున్న ఈ సినిమా 2025 ఆగస్ట్ 14న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ తేదీపై ఇప్పటికే ఊహాగానాలు ఉన్నప్పటికీ, యశ్ రాజ్ ఫిల్మ్స్ తాజాగా సోషల్ మీడియా ద్వారా అధికారికంగా నిర్ధారించింది.
‘వార్ 2’ మార్కెటింగ్ ప్రారంభించే ముందే మీరు అద్భుతంగా సెటప్ చేశారు. ఆగస్ట్ 14, 2025న ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్ లో సంచలనం జరగనుంది," అంటూ వైఆర్ ఎఫ్ తన ఎక్స్ అకౌంట్‌లో పోస్ట్ చేసింది. ఈ యాక్షన్ థ్రిల్లర్.. యశ్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్‌లో భాగంగా వస్తున్న సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి.
"వార్ 2"తో ఎన్టీఆర్ అధికారికంగా బాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్నారు. "దేవర, ఆర్ఆర్ఆర్" హిందీ డబ్బింగ్ వెర్షన్లతో ఉత్తర భారతదేశంలో ఎన్టీఆర్‌కు ఇప్పటికే మంచి క్రేజ్ వచ్చినా.. ఇది ఆయన తొలి ఒరిజినల్ హిందీ చిత్రం. బాలీవుడ్ సూపర్‌స్టార్ హృతిక్ రోషన్‌తో కలిసి ఎన్టీఆర్ స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు.
ప్రస్తుతం "వార్ 2" షూటింగ్ చివరి దశలో ఉంది. హృతిక్ రోషన్ కాలుకు గాయం కావడంతో చిత్రీకరణ తాత్కాలికంగా నిలిచిపోయింది. ఆయన కోలుకున్న వెంటనే మిగిలిన భాగాన్ని పూర్తిచేయనున్నారు. ఇదిలా ఉంటే, ఎన్టీఆర్ త్వరలో ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న "డ్రాగన్" చిత్రీకరణలో పాల్గొననున్నారు.
-
Home
-
Menu