బుక్ మై షోలో ‘వార్ 2’ నే టాప్ 1

2025 వేసవి మొదలైంది. కానీ ఇప్పటివరకు హిందీ చిత్ర పరిశ్రమలో కొన్ని మాత్రమే బడా సినిమాలు విడుదలయ్యాయి. విక్కీ కౌశల్ నటించిన "ఛావా" భారీ విజయాన్ని సాధించి రూ. 500 కోట్లకు పైగా వసూళ్లు చేస్తూ సంచలనంగా మారింది. అయితే సల్మాన్ ఖాన్ నటించిన భారీ చిత్రం "సికందర్" మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేక బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయాన్ని చవిచూసింది.
ఇంతలో సన్నీ డియోల్ నటించిన "జాట్" తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాను ప్రేక్షకులు ఎంతగా ఆదరిస్తారో చూడాలి. ఇదిలా ఉంటే, ఈ ఏడాది మిగతా భాగంలో విడుదలకు సిద్ధంగా పలు బడా చిత్రాలు ఉన్నాయి. వాటిలో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం హృతిక్ రోషన్ అండ్ ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న "వార్ 2". అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఆగస్ట్ 14న థియేటర్లలోకి రానుంది. బుక్ మై షో లో ఇప్పటివరకు ఈ సినిమాకు 61.7 వేలకుపైగా ఓట్లు వచ్చాయి. ఇది ఎటువంటి సందేహానికీ తావు లేకుండా ఈ సినిమా పట్ల ఉన్న అంచనాలను స్పష్టంగా చెబుతోంది.
ఈ జాబితాలో అజయ్ దేవ్‌గణ్ నటించిన "రైడ్ 2" రెండవ స్థానంలో ఉంది (41.1k ఓట్లు). అక్షయ్ కుమార్ నటించిన "వెల్‌కమ్ టు ది జంగిల్" (39.8k ఓట్లు), "హౌస్‌ఫుల్ 5" (33.3k ఓట్లు), "కేసరి: చాప్టర్ 2" (16.1k ఓట్లు) వరుసగా మూడవ, నాలుగవ, ఐదవ స్థానాల్లో ఉన్నాయి.
టైగర్ ష్రాఫ్ – "బాఘీ 4" (13k ఓట్లు)
సిద్ధాంత్ చతుర్వేది – "ధడక్ 2" (11.4k ఓట్లు)
సంజయ్ దత్ – "ది భూత్ని" (10k ఓట్లు)
ధనుష్ – "తేరే ఇష్క్ మెయిన్" (9.8k ఓట్లు)
ఇన్ని భారీ చిత్రాల మధ్య ఈ తొమ్మిది సినిమాలలో ఎంతమంది బాక్సాఫీస్ దగ్గర గెలిచే ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉంటాయో కాలమే చెప్పాలి. కానీ ఒక్క విషయం మాత్రం నిజం.. ఈ వేసవిలో హిందీ సినిమా అభిమానుల వినోదానికి ఎలాంటి కొరతా ఉండదు.
-
Home
-
Menu