ఫ్లాప్ హీరోయిన్ అయినా.. వరుస ఆఫర్స్ !

ఫ్లాప్ హీరోయిన్ అయినా..  వరుస ఆఫర్స్ !
X
గత ఏడాది చివర్లో వచ్చిన ‘బేబీ జాన్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్లాప్ అయినా.. వామికా ఆఫర్ల పరంపర మాత్రం తగ్గలేదు.

ఇప్పటివరకు సైడ్ రోల్స్‌లో మెరిసిన పంజాబీ బ్యూటీ వామికా గబ్బీ.. ప్రస్తుతం ఐదు భాషల సినిమాలతో రీ ఎంట్రీకి రెడీ అవుతుంది. స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నను మించిపోయేలా బిజీ లైనప్‌తో అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. గత ఏడాది చివర్లో వచ్చిన ‘బేబీ జాన్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్లాప్ అయినా.. వామికా ఆఫర్ల పరంపర మాత్రం తగ్గలేదు.

వామికా గబ్బీ తన కెరీర్‌ను బాలనటిగా 2007లో వచ్చిన ‘జబ్ వి మెట్’ సినిమాతో ప్రారంభించింది. పంజాబీ చిత్ర పరిశ్రమతో పాటు హిందీ చిత్రాలలోనూ తనదైన ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. 2015లో తెలుగులో ‘భలే మంచి రోజు’ సినిమాతో టాలీవుడ్‌కి పరిచయం అయింది. అయితే ఆ తర్వాత సినిమాలకు గ్యాప్ తీసుకొని దాదాపు పదేళ్ల కు రీఎంట్రీకి రెడీ అవుతోంది.

ఇప్పటివరకు పలు భాషల్లో గుర్తింపు పొందిన ఈ పంజాబీ గుడియా.. తాజాగా ‘గూఢచారి 2’ లో కీలక పాత్రలో నటించబోతోందని చిత్ర నిర్మాతలు ఇటీవల అధికారికంగా ప్రకటించారు. అడివి శేష్ నటించిన గూఢచారి సీక్వెల్‌లో వామికా రీ ఎంట్రీ టాలీవుడ్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుందనేది వేచిచూడాల్సిన విషయం.

ప్రస్తుతం వామికా చేతిలో మొత్తం ఆరు ప్రాజెక్టులు ఉన్నాయి. వాటిలో పంజాబీ సినిమా కిక్లీ, తమిళ చిత్రాలు జీని, ఇరవాకలం, తెలుగులో గూఢచారి 2, బాలీవుడ్‌లో ‘దిల్ కా దర్వాజా ఖోల్ నా డార్లింగ్’ , మలయాళంలో ‘టికీ టాకా’ ఉన్నాయి. ఇలా ఐదు భాషలలో సినిమాలు చేస్తూ అగ్రహీరోయిన్లకు సవాల్ విసురుతోంది.

Tags

Next Story