‘డాన్ 3’ లో రణవీర్ సింగ్‌కు కొత్త విలన్ ఫిక్స్

‘డాన్ 3’ లో రణవీర్ సింగ్‌కు కొత్త విలన్ ఫిక్స్
X
'12th ఫెయిల్' సినిమాతో నటుడిగా తన అసాధారణ ప్రతిభను నిరూపించుకున్న విక్రాంత్ మాస్సీ, ‘డాన్ 3’ లో కీలక పాత్ర పోషించబోతున్నట్టు సమాచారం.

ఫర్హాన్ అక్తర్ తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘డాన్ 3’ గురించి గత కొంతకాలంగా సినీప్రేమికులలో మిశ్రమ స్పందన కనిపిస్తోంది. డాన్ ఫ్రాంచైజీ విషయంలో .. అభిమానులు పదేళ్లుగా షారుక్ ఖాన్‌ను తిరిగి డాన్ పాత్రలో చూడాలని ఆశపడ్డారు. కానీ ఆ ఆశలు నెరవేరకుండానే రణవీర్ సింగ్‌ను కొత్త డాన్‌గా ప్రకటించారు. ఇప్పటికే అమితాబ్ బచ్చన్, షారుక్ ఖాన్ లాంటి మహానటులు పోషించిన ఈ లెజెండరీ పాత్రను రణవీర్ ఎంతవరకు న్యాయం చేయగలడన్నదానిపై అభిమానుల్లో చర్చ జరుగుతోంది.

ఈ ప్రాజెక్ట్ ప్రకటించి రెండు సంవత్సరాలు అయినా, సినిమా నిర్మాణ పనులు చాలా నెమ్మదిగా సాగుతున్నాయి. అయితే, ఇప్పుడు ‘డాన్ 3’ గురించి భారీ అప్‌డేట్ ఒకటి బయటకు వచ్చింది. "డాన్ కి దుష్మన్ కి సబ్సే బడీ గల్తీ యేహ్ హై కి వో డాన్ కా దుష్మన్ హై!". షారుక్ ఖాన్ చెప్పిన ఈ అప్రతిహత డైలాగ్‌ను గుర్తుంచుకుంటే.. ఇప్పుడు డాన్‌కు ఓ శక్తివంతమైన శత్రువు దొరికినట్టే. రణవీర్ సింగ్‌కు విలన్‌గా విక్రాంత్ మాస్సీ ఎంపికయ్యాడని టాక్.

'12th ఫెయిల్' సినిమాతో నటుడిగా తన అసాధారణ ప్రతిభను నిరూపించుకున్న విక్రాంత్ మాస్సీ, ‘డాన్ 3’ లో కీలక పాత్ర పోషించబోతున్నట్టు సమాచారం. ఫర్హాన్ అక్తర్ రూపొందిస్తున్న ఈ భారీ చిత్రంలో ఆయన పాత్ర ఎలా ఉండబోతుందో తెలుసుకోవాలని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ భారీ ఫ్రాంచైజీ కొత్త సీక్వెల్ గురించి ఇంకా మరిన్ని ఆసక్తికరమైన వివరాలు వెలువడాల్సి ఉంది. రణవీర్ సింగ్, విక్రాంత్ మాస్సీ మధ్య టగ్ ఆఫ్ వార్ సన్నివేశాలు ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. డాన్ 3 త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళనుంది.

Tags

Next Story