‘దోస్తానా 2’ లో హీరోలు వీళ్ళే!

ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్ లో ఎంతోకాలంగా వాయిదా పడుతూ వస్తున్న 'దోస్తానా 2' ప్రాజెక్ట్ మొత్తానికి ముందుకు కదిలింది. తొలి భాగానికి గుండెగా ఉన్న ఎమోషన్స్ ను కంటిన్యూ చూస్తూనే, సమకాలీనతకు తగ్గట్టు కొత్త ట్విస్ట్‌లతో కూడిన స్క్రిప్ట్‌ను ఫైనల్ చేసినట్టు సమాచారం. ఈ కథ విని నిర్మాతలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని, జనవరి 2026లో షూటింగ్ మొదలుపెట్టి అదే ఏడాది చివర్లో సినిమా థియేటర్లలోకి తీసుకురావాలని మేకర్స్ లక్ష్యంగా పెట్టుకున్నారని తెలుస్తోంది.
ఈ సారి కథలో ప్రధాన పాత్రలుగా టాలెంటెడ్ యాక్టర్ విక్రాంత్ మస్సీ, యంగ్ హీరో లక్ష్య కనిపించనుండగా.. హీరోయిన్‌గా ఓ కొత్త యువ నటిని పరిచయం చేయనున్నారు. వినోదంతో పాటు భావోద్వేగాలకు ప్రాధాన్యం ఇచ్చేలా ఈ స్క్రిప్ట్ ఉండనుంది. 2008లో విడుదలైన అసలైన 'దోస్తానా'లో అభిషేక్ బచ్చన్, జాన్ అబ్రహామ్ ముఖ్యపాత్రలు పోషించి, ప్రియాంకా చోప్రాతో కలిసి అందరినీ ఆకట్టుకున్నారు. ఈ చిత్రం అప్పట్లో వినోదం, స్నేహం, ప్రేమ వంటి అంశాలను వినూత్నంగా చూపిస్తూ రొమాంటిక్ కామెడీ జానర్‌లో కల్ట్ హిట్‌గా నిలిచింది.
అప్పటినుంచి దానికి సీక్వెల్ వస్తుందనే ఊహాగానాలు నడుస్తూనే ఉన్నాయి. కానీ అధికారికంగా ఏమీ ఫిక్స్ కాలేదు. ఇప్పుడు మాత్రం 'దోస్తానా 2' ఖచ్చితంగా వస్తుందని అర్ధమవుతోంది. మ్యూజిక్, కామెడీ, రొమాన్స్, డ్రామా అన్నింటికీ సమతూకంగా చోటిచ్చేలా రూపొందిస్తున్నారని చెబుతున్నారు. ప్రస్తుతం దర్శకుడి ఎంపికపై చర్చలు కొనసాగుతున్నాయని, మరో పావుగంటలో అనౌన్స్‌మెంట్ వచ్చే అవకాశం ఉందని సమాచారం.
-
Home
-
Menu