ఆకట్టుకుంటున్న విక్కీ కౌశల్ హిస్టారికల్ మూవీ పోస్టర్స్ !

బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రధాన పాత్రల్లో నటిస్తున్న హిస్టారికల్ డ్రామా ‘ఛావా’ . ఈ సినిమా చరిత్రలో ఓ కీలక అధ్యాయాన్ని తెరపై ఆవిష్కరించనుంది. ఛత్రపతి శివాజీ మహారాజ్ కుమారుడు శంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రానికి లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహిస్తున్నారు.
తాజాగా, ఈ సినిమా పోస్టర్లు సామాజిక మాధ్యమాల్లో విడుదలవగా, ప్రేక్షకుల మన్ననలు పొందుతున్నాయి. పోస్టర్లలో విక్కీ కౌశల్ శంభాజీ మహారాజ్‌గా యుద్ధ భూమిలో వీరోచితంగా పోరాడుతున్న యోధుడిలా కనిపిస్తూ ఆకట్టుకుంటున్నారు. "పంచభూతాల్లో మూడైన అగ్ని, నీరు, వాయువులు అతనే" అనే వ్యాఖ్యతో పోస్టర్లు మరింత ఆసక్తిని కలిగించాయి.
ఈ చిత్రంలో శంభాజీ భార్య ఏసుభాయి పాత్రలో రష్మిక కనిపించనుంది. దినేశ్ విజన్ నిర్మిస్తున్న ఈ సినిమాలో అక్షయ్ ఖన్నా, అశుతోష్ రాణా, ప్రదీప్ రావత్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం హిస్టారికల్ డ్రామా ప్రేమికులను అలరించడానికి సిద్ధంగా ఉంది.
-
Home
-
Menu