లెజెండరీ డైరెక్టర్ బయోపిక్ లో విక్కీ కౌశల్ ?

లెజెండరీ డైరెక్టర్ బయోపిక్ లో విక్కీ కౌశల్ ?
X
ఈ బయోపిక్‌తో గురుదత్ గొప్పతనాన్ని, విజయాలను తెరపై ఆవిష్కరించాలని భావిస్తున్నారు. ఇక గురుదత్ పాత్రకు ఎవరు సరైన నటుడు అనే చర్చలో విక్కీ కౌశల్ పేరు వినిపించింది.

బాలీవుడ్ లెజెండరీ డైరెక్టర్ .. గురుదత్ జీవితం ఆధారంగా ఒక బయోపిక్ తెరకెక్కనుందని బాలీవుడ్ లో టాక్. దీనిని ఆయన 100వ జయంతి సందర్భంగా లేదా అంతకు ముందు ప్రకటించే అవకాశం ఉంది. తాజా సమాచారం ప్రకారం గురుదత్ వారసత్వాన్ని సెలబ్రేట్ చేసేందుకు ఒక బయోపిక్, వెబ్ సిరీస్ అడా ప్టేషన్‌పై... ఒక పూర్తి స్థాయి బయోపిక్ కోసం ప్రాథమిక చర్చలు జరుగు తున్నాయి.

ఈ బయోపిక్‌తో గురుదత్ గొప్పతనాన్ని, విజయాలను తెరపై ఆవిష్కరించాలని భావిస్తున్నారు. ఇక గురుదత్ పాత్రకు ఎవరు సరైన నటుడు అనే చర్చలో విక్కీ కౌశల్ పేరు వినిపించింది. గురుదత్ భావోద్వేగ లోతును విక్కీ కౌశల్ సమర్థవంతంగా పోషించగలడని నిర్మాతలు భావిస్తున్నారు. ఈ నిర్మాణ సంస్థ గురు దత్ సినిమాటిక్ మైలురాళ్లైన ప్యాసా , కాగజ్ కే ఫూల్ , చౌధ్వీం కా చాంద్ సాహిబ్ బీబీ ఔర్ గులామ్ చిత్రాలను పునరుద్ధరించి కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శించింది.

విక్కీతో చర్చలు ఇప్పటికే ప్రారంభమయ్యాయా అనేది తెలియదు. అయితే, గురు దత్ బయోపిక్ త్వరలో నిర్మాణంలోకి వెళ్లే అవకాశం ఉంది. మరోవైపు, విక్కీ కౌశల్ ప్రస్తుతం సంజయ్ లీలా భన్సాలీ యొక్క లవ్ అండ్ వార్ చిత్రంలో రణబీర్ కపూర్, ఆలియా భట్‌లతో కలిసి నటిస్తున్నాడు. ఇటీవల విడుదలైన ఛావా చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. మరి గురుదత్ గా విక్కీ కౌశల్ ఎలా ఉండబోతాడో చూడాలి.

Tags

Next Story