సంజయ్ దత్ సూపర్ హిట్ చిత్రానికి సీక్వెల్

సంజయ్ దత్ సూపర్ హిట్ చిత్రానికి సీక్వెల్
X
సినిమా విడుదలైన 26 సంవత్సరాల తర్వాత.. ఈ చిత్రాన్ని ఫ్రాంచైజీగా మార్చే దిశగా హీరో సంజయ్ దత్, దర్శకుడు మహేష్ మంజ్రేకర్ మధ్య చర్చలు జరుగుతున్నాయని సమాచారం.

1999 లో విడుదలైన హిట్ గ్యాంగ్‌స్టర్ డ్రామా ‘వాస్తవ్’ కు సీక్వెల్ రూపొందే అవకాశం ఉంది. ఈ సినిమా విడుదలైన 26 సంవత్సరాల తర్వాత.. ఈ చిత్రాన్ని ఫ్రాంచైజీగా మార్చే దిశగా హీరో సంజయ్ దత్, దర్శకుడు మహేష్ మంజ్రేకర్ మధ్య చర్చలు జరుగుతున్నాయని సమాచారం. తాజా సమాచారం ప్రకారం, దర్శకుడు మహేష్ ప్రస్తుతం స్క్రీన్‌ప్లేపై పని చేస్తున్నాడట. అది పూర్తయ్యాక.. సంజయ్‌కు ఫైనల్ డ్రాఫ్ట్ వినిపిస్తారు.

ఇప్పటికే సంజయ్ దత్ ఈ ప్రాజెక్టులో భాగస్వామ్యం అవ్వడానికి ఉత్సాహంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా రెండు ప్రధాన పాత్రలతో ఉండబోతుందని, భారతీయ చలనచిత్ర రంగంలో ఇప్పటివరకు వచ్చిన అతి పెద్ద గ్యాంగ్‌స్టర్ డ్రామాలలో ఒకటిగా రూపొందించబోతున్నట్లు తెలుస్తోంది. ఇదొక ఫ్రాంచైజీ చిత్రం. కానీ కొనసాగింపు కాదు. మహేష్ వాస్తవ్ ప్రపంచానికి అనుకూలమైన కథనాన్ని సిద్ధం చేశారు. ఈ కథను సంజయ్ దత్‌తో పంచుకున్నారు మేకర్స్. సంజయ్ దత్ రఘు పాత్రను మళ్లీ పోషించేందుకు ఉత్సాహంగా ఉన్నాడట.

సంజయ్ దత్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా.. రెండో కథానాయకుడిగా యువ తరం నటుడిని తీసుకోవడానికి చిత్రబృందం ప్లాన్ చేస్తోందని సమాచారం. "ఇది రెండు హీరోల కథ. స్క్రిప్ట్ పూర్తయిన వెంటనే.. మహేష్ , ఆయన టీమ్ ఓ యంగ్ హీరోని ఎంపిక చేయడంపై దృష్టి పెట్టనున్నారు.. అని సమాచారం. 2025 చివరలో.. షూటింగ్ ప్రారంభం అవుతుందని అంచనా. సుభాష్ కలే నిర్మిస్తున్న వాస్తవ్ 2 సినిమా కమర్షియల్ సినిమాగా డిజైన్ అవుతోంది. ఇందులో హార్డ్ హిట్టింగ్ డైలాగులు, వినోదభరిత గీతాలు, భారీ యాక్షన్ సన్నివేశాలు ఉంటాయి.

Tags

Next Story