సైనికుడి మేకోవర్ కోసం వరుణ్ కసరత్తులు

సైనికుడి మేకోవర్ కోసం వరుణ్ కసరత్తులు
X
సైనికుడిగా కనిపించేందుకు, నడవడికను, బాడీ లాంగ్వేజ్‌ను ప్రాక్టీస్ చేస్తూ, తగిన శిక్షణ తీసుకుంటున్నాడు వరుణ్ ధావన్ .

1997లో JP దత్తా దర్శకత్వంలో వచ్చిన హిందీ చిత్రం ‘బోర్డర్’ అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ సినిమాకి సీక్వెల్‌గా వస్తున్న ‘బోర్డర్ 2’ పై అంచనాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఇందులో సన్నీ డియోల్‌తో పాటు వరుణ్ ధావన్, దిల్జిత్ దోసాంఝ్, అహాన్ శెట్టి ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. 2024 డిసెంబర్‌లో ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభమైంది. 2026 జనవరిలో విడుదలకు సిద్ధమవుతోంది.

సినిమా షూటింగ్ ప్రారంభమైనప్పటి నుండి వరుణ్ ధావన్ ఈ ప్రాజెక్ట్‌ను ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాడు. తాజా సమాచారం ప్రకారం ‘‘వరుణ్ ఈ చిత్రానికి శక్తివంచన లేకుండా కష్టపడుతున్నాడు. ఇది అతని తొలి యుద్ధ చిత్రం మాత్రమే కాకుండా, భారీ యాక్షన్ సినిమా కూడా. అందుకే.. అతను తాను చేయగలిగినంత అద్భుతంగా, కాన్ఫిడెన్స్ గా నటించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాడు. సైనికుడిగా కనిపించేందుకు, నడవడికను, బాడీ లాంగ్వేజ్‌ను ప్రాక్టీస్ చేస్తూ, తగిన శిక్షణ తీసుకుంటున్నాడు.

వరుణ్ ధావన్ ఇప్పటివరకు రొమాంటిక్, కామెడీ పాత్రల్లో ఎక్కువగా మెప్పించాడు. కానీ ఇప్పుడు అతను యాక్షన్ హీరోగా ఎదగాలని చూస్తున్నాడు. గత ఏడాది ‘బేబీ జాన్’, ‘సిటాడెల్: హనీ బన్నీ’ వంటి యాక్షన్ ప్రాజెక్టుల ద్వారా కొత్త కోణాన్ని చూపించాడు. ‘బోర్డర్ 2’ అతని కెరీర్‌లో మరో మైలురాయిగా నిలుస్తుందనడంలో సందేహం లేదు.

Tags

Next Story