పర్వీన్ బాబీ బయోపిక్ కోసం ‘యానిమల్’ బ్యూటీ!

రణబీర్ కపూర్, సందీప్ వంగా కాంబోలో వచ్చిన సూపర్ హిట్ మూవీ ‘యానిమల్’. ఈ సినిమాతో సూపర్ క్రేజ్ తెచ్చుకుంది అందాల త్రిప్తి దిమ్రి. ఆ ఒక్క సినిమాతో ఆమె బాలీవుడ్ లో వరుస ఆఫర్స్ అందుకుంటోంది. ప్రస్తుతం పలు ఓటీటీ, సినిమా ప్రాజెక్టులతో బిజీగా ఉంది త్రిప్తి. తాజాగా, ఆమె ఓటీటీ ప్రపంచంలో ప్రత్యేకమైన ప్రాజెక్ట్ కోసం సిద్ధమవుతున్నట్టు సమాచారం. 70వ దశకంలో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందిన పర్వీన్ బాబీ జీవిత కథ ఆధారంగా రూపొందుతున్న బయోపిక్ వెబ్ సిరీస్‌లో త్రిప్తి ప్రధాన పాత్ర పోషించనున్నట్టు వార్తలు వస్తున్నాయి.
తాజా సమాచారం ప్రకారం.. ఈ వెబ్ సిరీస్‌కి ‘ది స్కై ఈజ్ పింక్’ ఫేమ్ షోనాలి బోస్ దర్శకత్వం వహించనున్నారు. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ కానున్న ఈ ప్రాజెక్ట్ త్వరలోనే చిత్రీకరణ ప్రారంభం కానుందని సమాచారం. త్రిప్తి డేట్స్ ఇప్పటికే ఫిక్స్ అయ్యాయని.. చిత్రబృందం ప్రాజెక్ట్‌ను వేగంగా ప్రారంభించేందుకు పనులు జరుపుకుంటోందని తెలుస్తోంది. ఒకప్పుడు బాలీవుడ్ లో ఎంతో మంది అగ్రకథానాయకులతో నటించి మెప్పించిన పర్వీన్ బాబీ జీవితంలోని ఆసక్తికరమైన విశేషాలతో ఒక ఎమోషనల్ రైడ్ గా ఈ సిరీస్ ఉండనుంది. ఇక ఓటీటీ ఫ్రంట్‌లో త్రిప్తి ఇప్పటికే ‘బుల్బుల్’ అండ్ ‘కాలా’ వంటి ప్రాజెక్ట్స్‌లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
త్రిప్తి ప్రస్తుతం విశాల్ భరద్వాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న మరో ఆసక్తికరమైన సినిమాలో నటిస్తోంది. ఇందులో ఆమె షాహిద్ కపూర్‌తో స్క్రీన్‌ను పంచుకోనుంది. సాజిద్ నడియాడ్‌వాలా సమర్పణలో తెరకెక్కుతోంది. డిసెంబర్ 5, 2025న థియేటర్లలో విడుదల కానుంది. ఇంకా త్రిప్తి దిమ్రి మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్ ‘ధడక్ 2’ లో కూడా నటిస్తోంది. సిద్ధాంత్ చతుర్వేది ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ సినిమాకు షాజియా ఇక్బాల్ దర్శకత్వం వహిస్తున్నారు. జీ స్టూడియోస్, ధర్మా ప్రొడక్షన్స్, క్లౌడ్ 9 పిక్చర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
-
Home
-
Menu