సంజయ్ దత్ హారర్ కామెడీ మూవీకి టైటిల్ ఫిక్స్ !

మౌని రాయ్, సన్నీ సింగ్, పలక్ తివారీతో కలిసి సంజయ్ దత్ ప్రధాన పాత్రలో నటిస్తున్న హారర్-కామెడీ చిత్రానికి ‘ది భూత్నీ’ టైటిల్‌ను ఫిక్స్ చేశారు మేకర్స్ . మహాశివరాత్రి సందర్భంగా.. ఈ చిత్రానికి సంబంధించిన ప్రత్యేక వీడియోను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఈ వీడియోలో, సంజయ్ దత్ శక్తివంతమైన వాయిస్ ఓవర్ ఇవ్వగా, ఆత్మలు, భయానక వాతావరణం, ఒక భయానక వృక్షం నడుమ జరిగే సంఘటనలను చూపించారు.
మౌని రాయ్ భయానక రూపంలో కనిపించగా, సన్నీ సింగ్, పలక్ తివారీ లవ్ ఇంట్రెస్ట్‌లుగా కనిపించారు. వీడియో చివర్లో సంజయ్ దత్ రెండు కత్తులను పట్టుకొని ఆత్మలతో పోరాడుతున్న దృశ్యం ఉత్కంఠను రేకెత్తించింది. ఈ చిత్ర కథలో హారర్, రొమాన్స్, కామెడీ అనే మూడు ప్రధాన అంశాలను మిళితం చేశామని, ప్రేక్షకులకు విభిన్న అనుభూతిని అందించ బోతున్నామని మేకర్స్ తెలిపారు.
ఈ చిత్రంలో సంజయ్ దత్, మౌని రాయ్, సన్నీ సింగ్, పలక్ తివారీతో పాటు ఆసిఫ్ ఖాన్, నిక్ తదితరులు నటిస్తున్నారు. సిద్ధాంత్ సచ్దేవ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను దీపక్ ముకుట్, సంజయ్ దత్ నిర్మిస్తున్నారు. సోహం రాక్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్, త్రీ డైమెన్షన్ మోషన్ పిక్చర్స్ బ్యానర్లపై ఈ సినిమా నిర్మితమవుతోంది. ఈ చిత్రం 2025 ఏప్రిల్ 18న గుడ్ ఫ్రైడే రోజున ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది
-
Home
-
Menu