సైఫ్ వెంట కరీనా వెళ్ళకపోవడానికి కారణమిదే !

సైఫ్ వెంట కరీనా వెళ్ళకపోవడానికి కారణమిదే !
X

సైఫ్ వెంట కరీనా వెళ్ళకపోవడానికి కారణమిదే !బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్‌పై అర్థరాత్రి దాడి జరిగిన సంఘటన కొన్ని రోజుల కిందట పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఇంట్లోకి చొరబడి ఓ వ్యక్తి సైఫ్‌ను కత్తితో గాయపరిచాడు. వెన్నులో తీవ్ర గాయాలతో బాధపడుతున్న సైఫ్, తన సహాయకుడి సహాయంతో వెంటనే ఆటోలో హాస్పిటల్‌కి వెళ్లిపోయాడు. అయితే ఈ ఘటనలో కరీనా కపూర్ ఎక్కడుంది? భర్తను తీసుకుని ఆమె ఎందుకు హాస్పిటల్‌కు రాలేదు? అనే ప్రశ్నలు తెరపైకి వచ్చాయి. ఇంటర్నెట్‌లో రకరకాల వార్తలు హల్‌చల్ చేశాయి. కొన్ని మీడియా వర్గాలు కరీనానే సైఫ్‌ను అపహాస్యం చేసినట్టు కథనాలను ప్రచురించాయి. బాలీవుడ్‌లో ఆమెపై విమర్శలు గుప్పించాయి. అయితే ఎట్టకేలకు సైఫ్ అలీఖాన్ స్వయంగా ఈ విషయంపై స్పందించాడు.

హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన అనంతరం మీడియాతో మాట్లాడిన సైఫ్, ఆ రాత్రి జరిగిన అసలైన కథను వెల్లడించాడు. “నాపై దాడి జరిగిన వెంటనే.. కరీనా తైమూర్‌ను తీసుకుని బయటకొచ్చేసింది. ఇంట్లో అగంతకుడు ఇంకా ఉన్నాడు, మరిన్ని దాడులు చేసే అవకాశముందని ఆమె భయపడింది. చిన్న కొడుకు జెహ్‌ సురక్షితంగా ఉండాలని భావించింది. అందుకే నన్ను, తైమూర్‌ను, నా సహాయకుడు హరిని ఆటోలో పంపించింది,” అని వివరించాడు.

కరీనా తన బాధ్యతను పూర్తిగా నిర్వర్తించిందని, భద్రత కోణంలో ఆలోచించి, తొందరపడకుండా సరైన నిర్ణయం తీసుకుందని సైఫ్ చెప్పాడు. “చిన్న కొడుకు జెహ్‌ను తన సోదరి ఇంట్లో దించాక, వెంటనే హాస్పిటల్‌కి వచ్చింది. అసలు విషయాలు తెలిసిన తర్వాత అందరూ అర్థం చేసుకుంటారని భావిస్తున్నాను,” అని సైఫ్ స్పష్టం చేశాడు. ఈ ఘటన వెనుక ఉన్న నిజాన్ని తెలియజేస్తూ, అనవసరంగా కరీనాను విమర్శించినవారికి సైఫ్ సమాధానం ఇచ్చాడు

Tags

Next Story