‘డాన్ 3’ గురించి కీలక అప్డేట్ ఇదే !

‘డాన్ 3’ గురించి కీలక అప్డేట్ ఇదే !
X


బాలీవుడ్ బాద్షా షారుఖ్, ఫర్హాన్ అక్తర్ కాంబినేషన్ లో తెరకెక్కిన డాన్ సిరీస్ చిత్రాలు ఏ రేంజ్ లో సక్సెస్ అయ్యాయో తెలిసిందే. త్వరలో మూడో ‘డాన్’ తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నాడు దర్శకుడు ఫర్హాన్ అక్తర్. అయితే.. ఈసారి షారుఖ్ ఖాన్‌ నటించడం లేదు. సరికొత్త డాన్ గా రణవీర్ సింగ్ నటించ నున్నాడు. రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో అక్తర్ ‘డాన్ 3’ గురించి, ఈ చిత్రం ఎప్పుడు షూటింగ్ ప్రారంభమవుతుందో వెల్లడించాడు దర్శకుడు ఫర్హాన్ అక్తర్ .

తాను ‘డాన్ 3’ గురించి అడిగే ప్రశ్నల నుంచి తప్పించుకోవాలనుకోవడం లేదని స్పష్టం చేసిన అక్తర్, “ఈ ఏడాదిలోనే ‘డాన్ 3’ షూటింగ్ ప్రారంభమవుతుంది. అలాగే ‘120 బహదూర్’ సంవత్సరాంతంలో విడుదల అవుతుంది” అని తెలిపారు. ఈ సినిమాలో రణవీర్ సింగ్‌కు జోడిగా కియారా అద్వానీ నటించనున్నారు. తాజా సమాచారం ప్రకారం ప్రస్తుతం ఈ చిత్రం ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉంది. ఫర్హాన్ అక్తర్‌తో పాటు రణవీర్ సింగ్ ప్రస్తుతం ఆదిత్య ధర్ దర్శకత్వంలో రూపొందుతున్న మరో చిత్రంతో బిజీగా ఉండటం వల్ల ‘డాన్ 3’ పనులు 2025 మార్చి నుంచి వేగంగా మొదలవుతాయని పేర్కొంది.

ఇప్పుడు ఫర్హాన్ అక్తర్ ‘120 బహదూర్’ చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ఈ సినిమా 1962లో జరిగిన రెజాంగ్ లా యుద్ధంలో పరమ వీర్ చక్ర విజేత మేజర్ శైతాన్ సింగ్ భాటీ పాత్రను ఆధారంగా చేసుకుని రూపొందిస్తున్నారు. ఇదివరకు ‘డాన్ 3’ చిత్రం వాయిదా పడిందనే వార్తలు వినిపించాయి. అయితే, ఆ పుకార్లకు ఫర్హాన్ అక్తర్ తెరదించారు. ఈ సినిమా యథావిధిగా కొనసాగుతుందని స్పష్టం చేశారు. మరి ఈ మూడో డాన్ ఏ రేంజ్ లో సక్సె్స్ అవుతుందో చూడాలి.

Tags

Next Story