అక్షయ్ కుమార్ సూపర్ హిట్ చిత్రానికి మరో సీక్వెల్ !

అక్షయ్ కుమార్ సూపర్ హిట్ చిత్రానికి మరో సీక్వెల్ !
X
‘హేరాఫేరీ 2’ కు కొనసాగింపుగా రూపొందించనున్న ‘హేరాఫేరీ 3’ ను ఫర్హాద్‌ సామ్‌జీ దర్శకత్వం వహించనున్నారు.

బాలీవుడ్‌ స్టార్‌ అక్షయ్‌ కుమార్‌ ప్రధాన పాత్రలో నటించిన ప్రసిద్ధ కామెడీ డ్రామా చిత్రం ‘హేరాఫేరీ’ గురించి సినీ ప్రియులకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. 2000లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద అద్భుత విజయం సాధించి.. ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్వులు పంచింది. ఈ చిత్రానికి ఇప్పటివరకు ఫ్రాంచైజీగా వచ్చిన భాగాలూ ప్రేక్షకుల్లో మంచి ఆదరణ పొందాయి.

తాజాగా, ఈ సూపర్‌హిట్‌ సిరీస్‌ లో మూడో భాగాన్ని తెరకెక్కించేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తుందనే సమాచారం వెలువడింది. ‘హేరాఫేరీ 2’ కు కొనసాగింపుగా రూపొందించనున్న ‘హేరాఫేరీ 3’ ను ఫర్హాద్‌ సామ్‌జీ దర్శకత్వం వహించనున్నారు.

ఫిరోజ్‌ నడియాడ్‌ వాలా ఈ చిత్రాన్ని నిర్మించనుండగా, అన్ని కార్యక్రమాలు సజావుగా సాగితే ఈ ఏడాదిలోనే షూటింగ్‌ ప్రారంభం కానుందని అక్షయ్‌ సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. హాస్యభరిత కంటెంట్‌తో మరింతగా నవ్వుల పువ్వులు పూయిస్తుందనే అంచనాలతో ఈ మూడో భాగంపై అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది.

Tags

Next Story