‘రేంజర్’ చిత్రానికి అంత రేంజ్ ఉందా?

‘రేంజర్’  చిత్రానికి అంత రేంజ్ ఉందా?
X
మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా ఈ సినిమాలో అజయ్ దేవ్‌గన్, సంజయ్ దత్‌లతో కలిసి ప్రధాన పాత్ర పోషించనుంది.

అజయ్ దేవ్‌గన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న "రేంజర్" చిత్రానికి సంబంధించి తాజాగా ఓ అప్డేట్ వచ్చింది. ‘మిషన్ మంగళ్’ దర్శకుడు జగన్ శక్తి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఒక విభిన్నమైన అడ్వెంచర్ థ్రిల్లర్‌గా "రేంజర్" అనే మూవీ రూపొందనుంది. లవ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ఈ చిత్రంలో అజయ్ దేవ్‌గన్, సక్సెస్‌ఫుల్ "దే దే ప్యార్ దే" ఫ్రాంచైజీ తర్వాత మళ్లీ కలసి పనిచేస్తున్నారు.

సంజయ్ దత్ ఈ చిత్రంలో ప్రతినాయక పాత్రలో నటించనున్నట్లు సమాచారం. ఇప్పటికే ప్రీ-ప్రొడక్షన్ పనులు వేగంగా సాగుతున్న ఈ సినిమా మార్చి చివర్లో సెట్స్ మీదకు వెళ్లనుంది. తాజాగా, ఈ చిత్రానికి సంబంధించి మరో ఆసక్తికరమైన సమాచారం లభించింది. మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా ఈ సినిమాలో అజయ్ దేవ్‌గన్, సంజయ్ దత్‌లతో కలిసి ప్రధాన పాత్ర పోషించనుంది.

ఏప్రిల్ మొదటి వారంలో ఆమె సినిమా షూటింగ్‌లో జాయిన్ కానుంది. తమన్నా ఈ ప్రాజెక్ట్‌పై చాలా ఉత్సాహంగా ఉంది. ఈ పాత్రలో ఒక రిడెంప్షన్ ఆర్క్ ఉండటంతో.. ఆమెకు ఇది చాలా ప్రత్యేకమైన పాత్ర. ఆమె ఇప్పటికే సినిమాకు సంబంధించిన ప్రీప్ వెర్చువల్ సెషన్స్‌లో పాల్గొనగా.. స్క్రిప్ట్ రీడింగ్ సెషన్స్‌లో కూడా యాక్టివ్‌గా ఉంది. ఈ సినిమాలో మరో పలు ప్రముఖ నటీనటులు కూడా భాగం కానున్నట్లు సమాచారం, అయితే వారి పేర్లు ఇంకా గోప్యంగా ఉంచారు. సినిమా కోసం సుదీర్ఘ షెడ్యూల్ ప్లాన్ చేయబడిందని.. 2026లో విడుదల చేయాలని మేకర్స్ అనుకుంటున్నట్లు సమాచారం.

Tags

Next Story