బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ పాత్రలో తమన్నా

తమన్నా భాటియా తన కెరీర్‌ను రీడిఫైన్ చేసే మూడ్‌లో ఉంది. ఈ స్టార్ హీరోయిన్ ఇప్పటివరకూ తనను సాంప్రదాయ హీరోయిన్ రోల్స్‌కే పరిమితం చేసుకున్న బౌండరీస్‌ను బద్దలు కొట్టాలని ఫిక్స్ అయిపోయింది. ఇకపై కేవలం గ్లామర్ రోల్స్‌తో సరిపెట్టుకోవడం ఆమెకు ఇష్టం లేదు. బదులుగా, వైవిధ్యమైన, సవాల్‌తో కూడిన, డిఫరెంట్ క్యారెక్టర్స్‌ను ఎక్స్‌ప్లోర్ చేయాలనే ఆలోచనలో ఉంది. తన మాటలకు కట్టుబడి, తమన్నా తన కెరీర్‌లో ఇప్పటివరకూ చేపట్టని ఓ బోల్డ్ అండ్ డేరింగ్ ప్రాజెక్ట్‌తో ముందుకు సాగుతోంది.
బాలీవుడ్ బజ్ ప్రకారం.. తమన్నా ఏక్తా కపూర్ సూపర్ హిట్ బోల్డ్ హారర్ ఫ్రాంచైజ్ ‘రాగిణి ఎంఎంఎస్’ సిరీస్‌లోని తదుపరి చాప్టర్.. అంటే ‘రాగిణి ఎంఎంఎస్ 3’లో లీడ్ రోల్‌లో కనిపించనుంది. ఈ సినిమా హారర్ అండ్ బోల్డ్ నెస్ హై-వోల్టేజ్ కాంబినేషన్‌గా రూపొందుతోందని టాక్. ఈ ప్రాజెక్ట్‌లో తమన్నా సెంటర్ స్టేజ్ తీసుకోనుంది. అది కూడా ఆమె కెరీర్‌ను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లేలా డిజైన్ చేయబడిన పాత్రతో.
గత కొన్ని సంవత్సరాల్లో తమన్నా తన ఇమేజ్‌ను బ్రేక్ చేస్తూ, ఆన్-స్క్రీన్ ఇంటిమేట్ సీన్స్, ముద్దు సన్నివేశాలు, రొమాంటిక్ సీక్వెన్స్‌లతో కూడిన రోల్స్‌ను ధైర్యంగా స్వీకరించింది. ఆమె గతంలో ఉన్న ‘నో కిస్సింగ్, నో రొమాన్స్’ వంటి రూల్స్‌ను పక్కనపెట్టి, తన యాక్టింగ్ రేంజ్‌ను విస్తరించే పాత్రలపై ఫోకస్ చేసింది. ఇప్పుడు ‘రాగిణి ఎంఎంఎస్ 3’తో, ఆమె ఇంకా ఒక అడుగు ముందుకేసి, తన కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి, బోల్డ్‌గా, ఇంటెన్స్‌గా ఉండే క్యారెక్టర్‌ను ప్లే చేయడానికి రెడీ అవుతోంది.
ఈ సినిమా ఆమె కెరీర్‌లో ఒక టర్నింగ్ పాయింట్‌గా నిలవనుందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. హారర్, బోల్డ్ నెస్ మిక్స్ చేసిన ఈ ఫ్రాంచైజ్ ఎప్పటినుంచో ప్రేక్షకులను ఆకర్షిస్తోంది. మరి తమన్నా ఈ సినిమాతో ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ కొత్త ఫేజ్‌లో తమన్నా తన టాలెంట్‌ను మరోసారి ప్రూవ్ చేయడానికి సిద్ధంగా ఉంది.
-
Home
-
Menu