‘నషా’ సాంగ్ కోసం అంత పారితోషికమా?

‘నషా’ సాంగ్ కోసం అంత పారితోషికమా?
X
ఈ పాట కోసం తమ్మూ ఏకంగా రూ. 1 కోటి తీసుకున్నట్లు టాక్. ఇదే ఆమె గతంలో చేసిన ‘ఆజ్ కి రాత్’ స్పెషల్ సాంగ్‌కు తీసుకున్న పారితోషికంతో సమానం కావడం విశేషం.

‘నువు కావాలయ్యా’ లాంటి స్పెషల్ సాంగ్స్‌తో ప్రేక్షకుల మదిలో ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న తమన్నా భాటియా.. ఇప్పుడు మరోసారి హాట్ టాపిక్ అయింది. ఈసారి ఆమె ‘రైడ్ 2’ సినిమాలోని మాస్‌ నంబర్ నషా తో గ్లామర్ పరంగా అదరగొట్టేసింది.అలాగే... ఏప్రిల్ 17న విడుదల కాబోతున్న ‘ఓదెల 2’ లో శివ శక్తి అనే శక్తివంతమైన పాత్రతో ఆమె.. పాటలే కాకుండా కథానాయికగా కూడా తన స్థానం తిరిగి సంపాదించుకోవాలని ఆశిస్తోంది.

నషా పాట విడుదలైన 24 గంటల లోపే 10 మిలియన్ల వ్యూస్‌ను దాటి ట్రెండింగ్‌లోకి ఎగబాకింది. పాటలోని ఎనర్జిటిక్ వైబ్, తమన్నా స్పెషల్ ఎక్స్‌ప్రెషన్స్.. కట్‌చేసే స్టెప్స్ అన్నీ కలిసొచ్చి మరోసారి మ్యాజిక్‌ క్రియేట్ చేశాయి. అయితే పాటకంటే ఎక్కువగా ఇప్పుడు చర్చకు వస్తున్నది తమన్నా తీసుకున్న రెమ్యూనరేషన్ గురించే. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ పాట కోసం తమ్మూ ఏకంగా రూ. 1 కోటి తీసుకున్నట్లు టాక్. ఇదే ఆమె గతంలో చేసిన ‘ఆజ్ కి రాత్’ స్పెషల్ సాంగ్‌కు తీసుకున్న పారితోషికంతో సమానం కావడం విశేషం.

తమన్నా తీసుకొనే రెమ్యూనరేషన్ ఎక్కువైనా, నిర్మాతలు సంతోషంగానే ఉన్నారు. ఎందుకంటే ఆమె వస్తే పాట హిట్ అవుతుందనే నమ్మకంతోనే ఇప్పుడు తమన్నాని హై-ఇంపాక్ట్ నంబర్లకు ఓ బ్రాండ్‌గా భావిస్తున్నారు. నషా యూట్యూబ్‌లో లక్షల వ్యూస్‌ రాబడుతో ఆ పెట్టుబడి ఫలితాలు ఇవ్వడం మొదలుపెట్టింది కూడా. ఇక పాటల ద్వారా ఫేమ్‌ను కంటిన్యూ చేస్తూనే, ‘ఓదెల 2’ తో కథానాయికగా కూడా తన కెరీర్‌ను మళ్లీ బలంగా నిలబెట్టుకోవాలని ఆమె కృషి చేస్తోంది.

మొదటి భాగమైన ‘ఓదెల రైల్వే స్టేషన్’ మూవీ మంచి పేరు తెచ్చుకున్న నేపథ్యంలో, ఈ సీక్వెల్‌పై తమన్నాకు మంచి నమ్మకమే ఉంది. ఈ సినిమా హిట్ అయితే, తాను కథానాయికగా మరోసారి టాప్ ప్లేస్‌లో నిలబడతానన్న ఆశ ఆమెలో కనిపిస్తోంది. తమన్నా అభిమానులు మాత్రం ఇప్పుడు డబుల్ హ్యాపీ. ఒకవైపు నషా తో డాన్స్ ఫెస్ట్, మరోవైపు ‘ఓదెల 2’ తో సీరియస్ అండ్ పవర్‌పుల్ రోల్.. తమన్నా రెండు వైపులా దూసుకెళ్తోంది.

Tags

Next Story