‘జాట్’ ట్రైలర్ రిలీజ్ కు వేళాయెరా !

‘జాట్’ ట్రైలర్ రిలీజ్ కు వేళాయెరా !
X
ఈ యాక్షన్ మూవీ ట్రైలర్ మార్చి 22న విడుదల కానుందని చిత్ర బృందం ప్రకటించింది.

'గదర్ 2' భారీ సక్సెస్ తర్వాత సన్నీ డియోల్ వరుస చిత్రాల షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం 'బోర్డర్ 2' చిత్రీకరణలో నిమగ్నమైన ఆయన.. మరోవైపు రాబోయే మాస్ ఎంటర్‌టైనర్ 'జాట్'ను ప్రమోట్ చేస్తున్నారు. తాజాగా.. ఈ యాక్షన్ మూవీ ట్రైలర్ మార్చి 22న విడుదల కానుందని చిత్ర బృందం ప్రకటించింది. ప్రేక్షకులకు ఇప్పటివరకు చూడని స్థాయిలో యాక్షన్ అందించ బోతున్నామని నిర్మాతలు హామీ ఇచ్చారు.

ఇక ఈ సినిమా అధికారిక ట్రైలర్ లాంచ్ ఈవెంట్ వివరాలను వెల్లడించారు మేకర్స్. ఈ భారీ ఈవెంట్ రాజస్థాన్‌లోని జైపూర్‌లోని విద్యాధర్ నగర్ స్టేడియంలో.. మార్చి 22న సాయంత్రం 5 గంటలకు జరుగనుంది. ఈ మేరకు ఓ కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో సన్నీ డియోల్ ఓ కూల్ డ్రింక్ తాగుతూ తన శత్రువులను నేలకూల్చుతున్న తీరు ఆకట్టుకుంటోంది.

ఈ పోస్టర్‌ను షేర్ చేస్తూ చిత్రబృందం.. ‘ఇంకెప్పుడూ చూడని స్థాయిలో యాక్షన్‌కు సిద్ధం అవ్వండి. ‘జాట్’ ట్రైలర్ మార్చి 22న విడుదల. గ్రాండ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్, విద్యాధర్ నగర్ స్టేడియం, జైపూర్, సాయంత్రం 5 గంటలకు. ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ ఏప్రిల్ 10న’.. అంటూ క్యాప్షన్ ఇచ్చారు.

ఇంతకు ముందు విడుదలైన టీజర్‌ ద్వారా ఈ చిత్రంలో సన్నీ డియోల్‌ మాస్ యాక్షన్ లెవెల్ ఏంటో చూపించారు. శత్రువుల ఎముకలు విరుస్తూ, పవర్‌ఫుల్ డైలాగ్‌లు చెబుతూ ఆయన అదిరిపోయే మాస్ ఫీస్ట్ అందించబోతున్నట్లు స్పష్టమైంది. ఈ యాక్షన్ మూవీకి గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తుండగా, మైత్రీ మూవీ మేకర్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. హిందీ, తెలుగు, తమిళ భాషల్లో ఏప్రిల్ 10, 2025న విడుదల కానుంది.

Tags

Next Story