ఫ్యామిలీ మేన్ అవతారంలో యాక్షన్ డైనమైట్ !

ఫ్యామిలీ మేన్ అవతారంలో యాక్షన్ డైనమైట్ !
X
సన్నీ డియోల్ మరో సినిమాను కూడా సిద్ధం చేస్తున్నాడు. తాత్కాలికంగా ఈ చిత్రానికి 'సఫర్' అనే టైటిల్ పెట్టారు మేకర్స్.

బాలీవుడ్ యాక్షన్ డైనమైట్ సన్నీ డియోల్ అప్ కమింగ్ మూవీ 'జాట్' పై భారీ అంచనాలు నెలకొన్నాయి. 'గదర్ 2’ లాంటి భారీ సక్సెస్ తర్వాత ఆయన తదుపరిగా నటిస్తున్న చిత్రం కాబట్టి.. జాట్ రిలీజ్ గురించి ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అయితే, చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే.. సన్నీ డియోల్ మరో సినిమాను కూడా సిద్ధం చేస్తున్నాడు. తాత్కాలికంగా ఈ చిత్రానికి 'సఫర్' అనే టైటిల్ పెట్టారు మేకర్స్.

శశాంక్ ఉదాపుర్కర్ తెరకెక్కించిన ఈ కుటుంబ కథా చిత్రంలో డియోల్ తన సాధారణ మాచో అవతార్‌కు పూర్తిగా భిన్నమైన పాత్రలో కనిపించనున్నారు. సినిమా కథ ప్రకారం.. ఆయన ఒక మధ్యవయస్కుడైన కుటుంబ నాయకుడిగా నటిస్తారు. అనుకోని పరిస్థితుల ద్వారా జీవితాన్ని ఆనందంగా గడపడం ఎలా అనే విషయాన్ని తెలుసుకుంటారు.

ఈ కథా చిత్రంలోని భావోద్వేగాలను పరిగణలోకి తీసుకుని.. మేకర్స్ దీన్ని థియేట్రికల్ రిలీజ్ కాకుండా ఓటీటీ ద్వారా విడుదల చేయాలని నిర్ణయించారు. సిమ్రన్ బగ్గా మరియు దర్శన్ జరీవాలా ముఖ్యపాత్రల్లో నటించిన ఈ సినిమా 2024 లోనే చిత్రీకరణను పూర్తి చేసుకుంది. ప్రస్తుతం నిర్మాత విశాల్ రాణా ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లతో చర్చలు జరుపుతున్నారు.

దర్శకుడు శశాంక్ ఉదాపుర్కర్, ఇంతకు ముందు 'అన్నా , ప్రవాస్' లాంటి చిత్రాలను రూపొందించారు. ఈ సినిమాతో సన్నీ డియోల్ కొత్త కోణాన్ని ప్రేక్షకులకు పరిచయం చేయాలని భావించారు. అయితే, ఆయన ప్రస్తుతం సక్సెస్ వేవ్‌ను ఎంజాయ్ చేస్తున్నప్పటికీ, మేకర్స్ ఈ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేయడమే సరైన నిర్ణయం అని భావించారు.

Tags

Next Story