సునీల్ శెట్టి ‘కేసరివీర్’ విడుదల వాయిదా !

సునీల్ శెట్టి ప్రధాన పాత్రలో నటించిన పీరియడ్ డ్రామా ‘కేసరివీర్’. ఈ చిత్రం విడుదల తేదీ మారింది. నిజానికి ఈ మార్చి 14 న థియేటర్లలో విడుదల కావాల్సిన ఈ చిత్రం.. ఇప్పుడు మే 16 కి వాయిదా పడింది. అధికారిక డిస్ట్రిబ్యూటర్ పనోరమా స్టూడియోస్ ఈ నిర్ణయాన్ని ప్రకటించింది. ప్రపంచ వ్యాప్తంగా మరింత పగడ్బందీ విడుదల కోసం రిలీజ్ డేట్ చేంజ్ చేసినట్టు తెలిపారు.
ఈ చిత్రంలో సునీల్ శెట్టి, సూరజ్ పంచోలి, వివేక్ ఒబేరాయ్ ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. కాను చౌహాన్ నిర్మించిన ఈ చిత్రానికి ప్రిన్స్ ధిమాన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో కొత్త విడుదల తేదీ ప్రకటిస్తూ పనోరమా స్టూడియోస్, .. ‘కేసరివీర్’ పై మీ అందరి ప్రేమ, ఆసక్తి ఎంతో అద్భుతంగా ఉంది. మరింత గొప్ప స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు మేము దీని విడుదల తేదీని మే 16కి మార్చుతున్నాం.. అని పేర్కొన్నారు.
‘కేసరివీర్’ 14వ శతాబ్దంలో సోమనాథ దేవాలయాన్ని ఆక్రమించబోయే దుండగుల నుంచి రక్షించేందుకు పోరాడి.. తన ప్రాణాలను అర్పించిన గౌరవనీయమైన వీరుల కథను ఆవిష్కరించబోతోంది. ప్రస్తుతం సునీల్ శెట్టి చిత్ర పరిశ్రమలో చాలా యాక్టివ్‌గా ఉంటూ వరుస ప్రాజెక్టులపై దృష్టి పెట్టారు. ఇటీవలే కరణ్ జోహార్ నిర్మించిన ‘నాదానియన్’ చిత్రంలో ఇబ్రాహీం అలీఖాన్, ఖుషీ కపూర్ లతో కలిసి నటించారు. అలాగే, ‘ది లెజెండ్ ఆఫ్ సోమనాథ్’, ‘వెల్‌కమ్ టు ది జంగిల్’, ‘నందాదేవి’, ‘హంటర్ 3’ వంటి చిత్రాలు కూడా ఆయన చేతిలో ఉన్నాయి.
-
Home
-
Menu