శ్రీలీలకు బాలీవుడ్ లో భలే అవకాశం !

శ్రీలీలకు బాలీవుడ్ లో భలే అవకాశం !
X
ఇటీవల రొమాంటిక్ జానర్‌లో వచ్చిన ‘సైయారా’ సూపర్ హిట్ కావడంతో, ఎమోషనల్ లవ్ స్టోరీలపై ప్రేక్షకుల్లో మళ్లీ ఆసక్తి పెరిగింది. దీంతో శ్రీలీల బాలీవుడ్‌లో సత్తా చాటే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి.

కన్నడ కస్తూరి శ్రీలీల సౌత్ ఇండియన్ సినిమాలో టాప్ యంగ్ స్టార్స్‌లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్నా.. గత రెండేళ్లలో ఆమె సక్సెస్ రేట్ కాస్త తగ్గింది. ‘గుంటూరు కారం, స్కంద, ఎక్స్‌ట్రా ఆర్టినరీ మేన్, రాబిన్‌హుడ్, జూనియర్’ వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాలను ఇవ్వలేదు. దీంతో ఆమె క్రేజ్‌లో స్వల్పంగా తేడా వచ్చింది. అయితే, బాలీవుడ్‌లో ఆమెకు కొత్త అవకాశాలు ఎదురవుతున్నాయి.

కార్తీక్ ఆర్యన్ సరసన అనురాగ్ బసు డైరెక్షన్‌లో రొమాంటిక్ డ్రామా “ఆశికీ 3” తో శ్రీలీల హిందీలోకి ఎంట్రీ ఇస్తోంది. ఈ ఏడాది టీజర్ రిలీజైనప్పుడు సినిమాపై హైప్ క్రియేట్ అయింది. ఇటీవల రొమాంటిక్ జానర్‌లో వచ్చిన ‘సైయారా’ సూపర్ హిట్ కావడంతో, ఎమోషనల్ లవ్ స్టోరీలపై ప్రేక్షకుల్లో మళ్లీ ఆసక్తి పెరిగింది. దీంతో శ్రీలీల బాలీవుడ్‌లో సత్తా చాటే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి.

తమిళంలో “పరశక్తి” సినిమాతో రాణించబోతుంది. అలాగే తెలుగులో రవితేజతో “మాస్ జాతర”లో కనిపించనుంది. మొత్తానికి ఇటీవలి సెట్‌బ్యాక్‌లు ఉన్నప్పటికీ, శ్రీలీల కెరీర్ కొత్త ఊపుతో ముందుకు సాగుతోంది. మరి బాలీవుడ్ లో శ్రీలీల అదృష్టం ఎలా ఉండబోతుందో చూడాలి.

Tags

Next Story