బాలీవుడ్ లో మరో భారీ ప్రాజెక్ట్ ?

బాలీవుడ్ లో మరో భారీ ప్రాజెక్ట్ ?
X
ఇప్పటికే కార్తిక్ ఆర్యన్‌తో "ఆశికీ 3"లో కథానాయికగా నటించేందుకు ఒప్పుకున్న ఆమె, తాజాగా మరో భారీ బాలీవుడ్ ప్రాజెక్ట్‌లో అవకాశం దక్కించుకోనున్నట్లు సమాచారం.

ఇటీవల అల్లు అర్జున్‌తో కలిసి నటించిన "కిస్సిక్" పాటలో తన అద్భుతమైన పెర్ఫార్మెన్స్‌తో అభిమానులను మెప్పించిన శ్రీలీల, తన బాలీవుడ్ ప్రయాణాన్ని మరింత వేగంగా కొనసాగిస్తోంది. ఇప్పటికే కార్తిక్ ఆర్యన్‌తో "ఆశికీ 3"లో కథానాయికగా నటించేందుకు ఒప్పుకున్న ఆమె, తాజాగా మరో భారీ బాలీవుడ్ ప్రాజెక్ట్‌లో అవకాశం దక్కించుకోనున్నట్లు సమాచారం.

త్వరలో తండ్రి కాబోయే సిద్ధార్థ్ మల్హోత్రా ప్రస్తుతం తన వ్యక్తిగత ఆనందాన్ని, వృత్తి జీవితాన్ని బ్యాలెన్సింగ్ గా కొనసాగిస్తున్నాడు. ప్రస్తుతం అతడు జాన్వీ కపూర్‌ కు జోడీగా "పరమ్ సుందరి" చిత్రంలో నటిస్తున్నాడు. ఇదిలా ఉండగా, సిద్ధార్థ్ మల్హోత్రా, మహావీర్ జైన్ కలిసి ఒక కామెడీ చిత్రాన్ని రూపొందించేందుకు సిద్ధమవుతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రానికి కథానాయికగా శ్రీలీల ఎంపికై అవకాశం దక్కించుకునే దశలో ఉందని సమాచారం.

ప్రస్తుతం చిత్ర నిర్మాతలు కథానాయిక ఎంపికపై చర్చలు జరుపుతున్నారు. శ్రీలీలతో చర్చలు కొనసాగుతున్నట్టు సమాచారం. నిర్ణయం తీసుకున్న వెంటనే అధికారిక ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది. సో.. శ్రీలీల బాలీవుడ్‌లో తన ప్రతిభను మరోసారి నిరూపించబోతోందని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ కొత్త ప్రాజెక్ట్ ఆమె కెరీర్‌లో మైలురాయిగా నిలవొచ్చని భావిస్తున్నారు.

Tags

Next Story