సోనాక్షి సిన్హా టాలీవుడ్ ఎంట్రీ ఫిక్స్?

సోనాక్షి సిన్హా టాలీవుడ్ ఎంట్రీ ఫిక్స్?
X

బాలీవుడ్ బ్యూటీస్ వరుసగా టాలీవుడ్ కి క్యూ కడుతున్నారు. ఈ లిస్టులోకి సోనాక్షి సిన్హా కూడా చేరబోతుందట. వెటరన్ యాక్టర్ శతృఘ్న సిన్హా తనయ సోనాక్షి.. 2010లో సల్మాన్ ఖాన్ ‘దబాంగ్’తో బాలీవుడ్‌లో అడుగుపెట్టింది. ఆ తరువాత పలు వాణిజ్య ప్రకటనలతో పాటు.. పలు బాలీవుడ్ హిట్స్ లో భాగస్వామ్యమయ్యింది.

లేటెస్ట్ గా సుధీర్ బాబు నటిస్తున్న 'జటాధర'లో ఫీమేల్ లీడ్ గా సోనాక్షి ఫైనలైజ్ అయినట్టు తెలుస్తోంది. వెంకట్ కళ్యాణ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘జటాధర’ ఇప్పటికే ముహూర్తాన్ని జరుపుకుంది. సూపర్ నేచురల్ మైథలాజికల్ థ్రిల్లర్‌గా ఈ సినిమా రూపొందుతోంది. జీ స్టూడియోస్ సమర్పణలో ఉమేష్ కె.ఆర్. బన్సాల్, ప్రేరణ అరోరా నిర్మిస్తున్న ఈ చిత్రం రెగ్యులర్ షూట్ కి రెడీ అవుతుంది.

మార్చి 8 నుంచి షూటింగ్ మొదలు పెట్టుకోనున్న ఈ సినిమా సోనాక్షికి తెలుగు పరిశ్రమలో ప్రత్యేక గుర్తింపు తీసుకురావొచ్చని భావిస్తున్నారు. సోనాక్షి వ్యక్తిగత జీవితం విషయానికొస్తే, సోనాక్షి సిన్హా తన ప్రియుడు జహీర్ ఇక్బాల్‌ను 2024, జూన్ 23న వివాహం చేసుకుంది.

Tags

Next Story