‘జటాధర’ షూట్ పూర్తి చేసిన సోనాక్షి సిన్హా !

‘జటాధర’ షూట్ పూర్తి చేసిన సోనాక్షి సిన్హా !
X
“జటాధార” సినిమాలోని తన పాత్రను పూర్తి చేసుకున్న సందర్భంగా సోషల్ మీడియా ద్వారా ఆనందం వ్యక్తం చేసింది. తాజాగా ఆమె తన టీంతో కలిసి దిగిన కొన్ని ఫొటోలు షేర్ చేస్తూ.. చిత్ర యూనిట్‌కి కృతజ్ఞతలు తెలిపింది.

బాలీవుడ్ అందాల హీరోయిన్ సోనాక్షి సిన్హా తన తొలి తెలుగు సినిమా “జటాధార” సినిమాలోని తన పాత్రను పూర్తి చేసుకున్న సందర్భంగా సోషల్ మీడియా ద్వారా ఆనందం వ్యక్తం చేసింది. తాజాగా ఆమె తన టీంతో కలిసి దిగిన కొన్ని ఫొటోలు షేర్ చేస్తూ.. చిత్ర యూనిట్‌కి కృతజ్ఞతలు తెలిపింది. ఆ ఫొటోల్లో సోనాక్షి తన సహ నటీనటులు, సాంకేతిక బృందంతో కలిసి ఉల్లాసంగా కనిపిస్తున్నారు.

ఈ సందర్భంగా ఆమె, “పూర్తయింది... నా తొలి తెలుగు సినిమా ‘జటాధార’ లో నా షూట్ పూర్తయ్యింది. మా టీమ్ అసలైన మ్యాజిక్ చేసింది. చాలా సరదాగా, చాలా ఉల్లాసంగా వర్క్ చేశాం.. మీరు చూసే రోజు కోసం ఎదురుచూస్తున్నాను.. అద్భుతమైన షూటింగ్ అనుభవం అందించినందుకు అందరికీ ధన్యవాదాలు... ” అంటూ ఎమోషనల్‌ నోట్ రాసింది.

సోనాక్షి సిన్హా “జటాధార” చిత్రంలో పూర్తిగా కొత్త పాత్రలో కనిపించనుంది. రెండో షెడ్యూల్‌లో కొన్ని కీలకమైన యాక్షన్ సన్నివేశాలు, హైఇంటెన్సిటీ ఎమోషనల్ సన్నివేశాల చిత్రీకరణ జరిగింది. ఇదొక సూపర్ నేచురల్ ఫాంటసీ థ్రిల్లర్. ఇది తెలుగు పరిశ్రమలో సోనాక్షి తొలి అడుగు కావడంతో పాటు, ఆమె కొత్తదనాన్ని ప్రదర్శించే చిత్రంగా మారనుంది. మార్చి 8, అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన సోనాక్షి ఫస్ట్ లుక్ విడుదలైంది. ఆమె శక్తిమంతమైన, గంభీరమైన అవతారంలో మెరిసింది.

ఈ చిత్రానికి వెంకట్ కల్యాణ్ దర్శకత్వం వహిస్తున్నారు. సుధీర్ బాబు ముఖ్యపాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాను జీ స్టూడియోస్ బ్యానర్‌పై ఉమేష్ కేఆర్ బన్స్‌ల్, పృణా అరోరా, అరుణ అగర్వాల్, శివిన్ నారంగ్ నిర్మిస్తున్నారు. ప్రేక్షకులు ఇప్పుడే ఈ సినిమాపై ఆసక్తిగా ఉన్నారు. సోనాక్షి అద్భుతమైన ట్రాన్స్ఫర్మేషన్, శక్తివంతమైన స్క్రీన్ ప్రెజెన్స్ చూసేందుకు వేచి ఉన్నారు.

Tags

Next Story