‘సితారే జమీన్ పర్’ సినిమా విడుదల అప్పుడే !

ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ మూవీస్ లో ఆమీర్ ఖాన్ నటిస్తున్న "సీతారే జమీన్ పర్" ఒకటి. 2007లో విడుదలైన "తారే జమీన్ పర్" చిత్రానికి ఇది సీక్వెల్. దాదాపు 18 సంవత్సరాల తరువాత ఆమీర్ ఖాన్, దర్శీల్ సఫారీ ఈ సినిమాలో మళ్ళీ కలిసి నటించనుండడం విశేషం. క్రిస్మస్ సందర్భంగా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు ఖాన్ తాజాగా ప్రకటించాడు.
2025 గణతంత్ర దినోత్సవం సందర్భంగా గుజరాత్‌లోని స్టాట్యూ ఆఫ్ యూనిటీ వద్ద జరిగిన ప్రత్యేక వేడుకల్లో ఆమీర్ ఖాన్ పాల్గొన్నాడు. ఈ సందర్భంలో అతడు తన రాబోయే చిత్రాల గురించి కొన్ని కీలక వివరాలను పంచుకున్నాడు. తన భవిష్యత్తు ప్రాజెక్టులు గుజరాత్‌లో చిత్రీకరించబడతాయా అని ప్రశ్నించగా, "సీతారే జమీన్ పర్" చిత్ర క్లైమాక్స్ వడోదరలో షూట్ చేశాం అని పేర్కొన్నారు. ఆమీర్ ఖాన్ మాట్లాడుతూ, “నా తదుపరి చిత్రం ‘సీతారే జమీన్ పర్.’ ఈ ఏడాది క్రిస్మస్‌కు విడుదల చేయాలని ప్రయత్నిస్తున్నాం. ఇది వినోదాత్మక చిత్రం. నాకు ఆ కథ చాలా బాగా నచ్చింది. ఈ చిత్రీకరణ ఇప్పటికే ప్రారంభమైంది” అని వివరించారు.
అంతేకాకుండా గుజరాత్‌తో తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. తన చిన్నప్పటి అనుభవాలను వివరిస్తూ, తన తండ్రి సినిమాల్లో చాలా భాగం గుజరాత్‌లో షూట్ అయ్యిందని చెప్పారు. ఆర్.ఎస్. ప్రసన్న దర్శకత్వంలో.. ఆమీర్ ఖాన్, కిరణ్ రావు దంపతుల నిర్మాణంలో రూపొందుతున్న "సీతారే జమీన్ పర్" లో .. దర్శీల్ సఫారీతో పాటు జెనీలియా దేశ్‌ముఖ్ ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. 2018లో విడుదలైన స్పానిష్ చిత్రం "చాంపియన్స్" ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది.
-
Home
-
Menu