‘సికందర్’ ఏ చిత్రానికీ రీమేక్ కాదు : ఏఆర్ మురుగదాస్

‘సికందర్’ ఏ చిత్రానికీ రీమేక్ కాదు : ఏఆర్ మురుగదాస్
X

సల్మాన్ ఖాన్, రష్మిక మందన్నా జోడీగా నటిస్తున్న హై యాక్టెన్ యాక్షన్ చిత్రం ‘సికందర్’. 2025లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో ఒకటి. ఈ సినిమా ప్రేక్షకులకు పూర్తిగా కొత్త అనుభవాన్ని అందించబోతోంది. ఈ చిత్ర దర్శకుడు ఏఆర్ మురుగదాస్ మాట్లాడుతూ.. ‘‘సికందర్’’ ఏ చిత్రానికీ రీమేక్ కాదు.. ఇది పూర్తిగా ఒరిజినల్ స్టోరీ అని తెలిపారు.

‘‘ఈ కథ ఎక్కడా రీమేక్ చేయబడలేదు. ప్రతీ సన్నివేశం, ప్రతీ ఫ్రేమ్ పూర్తిగా ఒరిజినల్‌గా డిజైన్ చేసి తెరకెక్కించాం. ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కలిగించేలా రూపొందించాం. ఇది ఏదైనా చిత్రానికి రీమేక్ అని మీకు అనిపిస్తే అది కేవలం యాదృచ్ఛికం మాత్రమే. ఈ చిత్రానికి ఎంతో ప్రత్యేకతను తెచ్చిపెట్టే అంశాల్లో మ్యూజిక్ ఒకటి. ప్రతిఒక్కరినీ ఆకట్టుకునే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ను ప్రతిభావంతుడైన సంగీత దర్శకుడు సంతోష్ నారాయణన్ అందించారు. చిత్రంలోని ఎనర్జీకి, విజువల్స్‌కు అతని సంగీతం గొప్ప అనుభూతిని ఇస్తుంది," అని ఆయన తెలిపారు.

ఈ సినిమాతో సల్మాన్ ఖాన్, ప్రముఖ నిర్మాత సాజిద్ నడియాడ్‌వాలా మరోసారి కలసి పనిచేస్తున్నారు. వీరిద్దరి కలయికలో ‘కిక్’, ‘ముఝ్‌సే షాదీ కరోగీ’ వంటి బ్లాక్‌బస్టర్లు వచ్చాయి. ఇక ‘సికందర్’ సినిమా 2025 మార్చి 28న, ఈద్ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది

Tags

Next Story