‘సికందర్’ హోళీ సాంగ్ అదిరింది!

‘సికందర్’ హోళీ సాంగ్ అదిరింది!
X

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘సికందర్‘ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సౌత్ డైరెక్టర్ ఏ.ఆర్.మురుగదాస్ తెరకెక్కిస్తున్న హిందీ చిత్రమిది. ఈ సినిమాలో సల్మాన్ కి జోడీగా రష్మిక మందన్నా నటిస్తుంది. ఈద్ స్పెషల్ గా రిలీజ్ కాబోతున్న ఈ మూవీ నుంచి హోళీ సాంగ్ రిలీజయ్యింది.




హోళీకి మూడు రోజుల ముందుగానే ఈ పాటను విడుదల చేశారు. ప్రీతమ్ మ్యూజిక్ లో ‘భం భం భోళే హోలీ‘ అంటూ సాగే ఈ గీతం కలర్ ఫుల్ గా ఆకట్టుకుంటుంది. ఈ పాటలో లీడ్ పెయిర్ సల్మాన్, రష్మిక లతో పాటు.. మరో స్టార్ బ్యూటీ కాజల్ అగర్వాల్ కూడా సందడి చేస్తుండడం విశేషం.

Tags

Next Story