ఇంటర్నేషనల్ ఎంట్రీ ఇవ్వబోతున్న శ్రుతిహాసన్ !

కోలీవుడ్ బ్యూటీ శృతి హాసన్ ప్రధాన పాత్రలో నటించిన బ్రిటిష్ సైకాలజికల్ థ్రిల్లర్ "ది ఐ". ఇండియాలో ఫిబ్రవరి 27న, అంటే ఈ రోజే ప్రీమియర్ అవుతోంది. ముంబైలో జరగనున్న 5వ వెంచ్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఈ చిత్రం ఓపెనింగ్ ఫీచర్ గా ప్రదర్శించ బడనుంది. డాఫ్నీ ష్మోన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం శృతిహాసన్‌కి అంతర్జాతీయ స్థాయిలో నటిగా గుర్తింపు తీసుకురానుంది.
ఈ సినిమాలో శృతి డయానా అనే పాత్రలో కనిపించనుంది. తన భర్త ఫెలిక్స్ ప్రమాదవశాత్తు మృతి చెందిన దీవికి ప్రయాణించి, అక్కడ అతని భస్మాన్ని చల్లాలని నిర్ణయించుకుంటుంది. అయితే ఆ ప్రయాణంతో ఆమె జీవితం అనూహ్యమైన మలుపులు తిరుగుతుంది. అథెన్స్, కార్ఫూ దీవుల్లో చిత్రీకరించిన ఈ సినిమా గ్రీక్ ద్వీపాల అందాలను కళ్ళకు కట్టినట్లుగా చూపిస్తూనే, కథలోని థ్రిల్లింగ్ మూమెంట్స్‌కు అత్యద్భుతమైన నేపథ్యాన్ని అందిస్తుంది. ఇండియన్ ప్రీమియర్ సందర్భంగా శృతి హాసన్ మాట్లాడుతూ, "సైకాలజికల్ థ్రిల్లర్లు ఎప్పుడూ నన్ను ఆకర్షించే జానర్. 'ది ఐ' లో నటించడం నాకు ఒక కొత్త అనుభూతిని ఇచ్చింది" అని చెప్పింది.
దర్శకురాలు డాఫ్నీ ష్మోన్ మాట్లాడుతూ, "ది ఐ' చిత్రాన్ని నా కుటుంబ సభ్యుల ఊరు అయిన కార్ఫూ దీవికి అంకితం చేశాను. అంతేకాకుండా.. దుఃఖం గురించి మానసిక భావోద్వేగాలను అధ్యయనం చేసే కథ ఇది" అని వివరించారు. ఈ చిత్రంపై ఇండియన్ ప్రేక్షకుల ఆసక్తి నెలకొనగా, ముంబైలో జరగనున్న ప్రీమియర్ తర్వాత సినిమా విడుదల తేదీపై అంచనాలు పెరుగుతున్నాయి
-
Home
-
Menu