చీటింగ్ కేసులో శిల్పా శెట్టి- రాజ్ కుంద్రా జోడీ

చీటింగ్ కేసులో శిల్పా శెట్టి- రాజ్ కుంద్రా జోడీ
X
ముంబైకి చెందిన బిజినెస్‌మన్ దీపక్ కొఠారీ, ఈ జంట తనను రూ. 60 కోట్ల ఇన్వెస్ట్‌మెంట్ డీల్‌లో మోసం చేసిందని ఆరోపిస్తున్నాడు.

బాలీవుడ్‌లో గ్లామర్, కాంట్రవర్సీ ఎప్పుడూ కలిసి నడుస్తాయి. ఈ వారం శిల్పా శెట్టి, రాజ్ కుంద్రా జోడీ స్పాట్‌లైట్‌లో ఉన్నారు. ముంబైకి చెందిన బిజినెస్‌మన్ దీపక్ కొఠారీ, ఈ జంట తనను రూ. 60 కోట్ల ఇన్వెస్ట్‌మెంట్ డీల్‌లో మోసం చేసిందని ఆరోపిస్తున్నాడు. ఒక బిజినెస్ సహకారంగా మొదలైన ఈ వ్యవహారం ఇప్పుడు పూర్తి స్థాయి లీగల్ ఫైట్‌గా మారింది.

దీపక్ ఫిర్యాదు ప్రకారం, 2015 నుంచి 2023 వరకు బెస్ట్ డీల్ టీవీ అనే వెంచర్‌లో ₹60.48 కోట్లు పెట్టాడు. ఈ కంపెనీలో శిల్పా, రాజ్ డైరెక్టర్లుగా ఉన్నారు అప్పట్లో దీపక్‌కు 87% కంటే ఎక్కువ షేర్లు ఉన్నాయి. అతని ఆరోపణ ఏంటంటే.. బిజినెస్ కోసం పెట్టిన డబ్బును వీళ్లు వ్యక్తిగత అవసరాలకు మళ్లించారు. అంతేకాదు, 2016 ఏప్రిల్‌లో శిల్పా స్వయంగా గ్యారెంటీ ఇచ్చినట్టు, కానీ కొన్ని నెలల తర్వాత డైరెక్టర్ పదవి నుంచి రాజీనామా చేసి, దాన్ని బహిరంగంగా ప్రకటించలేదని ఆరోపణ. బెస్ట్ డీల్ టీవీ దివాళా తీసిన విషయం దీపక్‌కు తర్వాత తెలిసింది.

ఇది కేవలం బిజినెస్ ఫెయిల్యూర్ కాదు, అతని దృష్టిలో ఒక బిట్రేయల్. అతని నమ్మకం, పెట్టుబడి, సంవత్సరాల సంబంధం ఒక్కసారిగా కుప్పకూలినట్టు అనిపించింది. ఈ ఫిర్యాదు ఇప్పుడు ఎకనామిక్ ఆఫెన్సెస్ వింగ్ కి అప్పగించ బడింది. లోతైన ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. శిల్పా, రాజ్‌ల విషయానికొస్తే.. ఈ న్యూస్ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఇన్వెస్టిగేషన్ ఇంకా కొనసాగుతున్నప్పటికీ, ఈ కేసు వీళ్ల లీగల్ ట్రబుల్స్‌కు మరో అధ్యాయాన్ని జోడించింది. ఇది పొరపాటా, లేక పెద్ద స్కామా అనేది తేలాల్సి ఉంది. కానీ ఒక్కటి మాత్రం క్లియర్. ఈ లీగల్ డ్రామా ఒక రియల్‌లైఫ్ కోర్ట్‌రూమ్ థ్రిల్లర్‌లా సాగుతోంది.

Tags

Next Story