త్వరలోనే షారుఖ్ ‘మేన్ హూనా 2’ మూవీ?

త్వరలోనే షారుఖ్  ‘మేన్ హూనా 2’ మూవీ?
X
"ఫరా ఖాన్ 'మేన్ హూనా 2' కోసం ఒక కొత్త ఐడియా సిద్ధం చేశారు. ఈ కథను ఎలా తీసుకెళ్లాలో ఆమె ఆలోచన షారుఖ్‌కు ఎంతో నచ్చింది.

బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్, ఫరా ఖాన్ కాంబినేషన్ లో మరో సినిమా రాబోతున్నట్టు సమాచారం. గతం లో ఈ ఇద్దరి కలయిక లో వచ్చిన "మేన్ హూనా" సినిమా సూపర్ హిట్ అయిన సంగతి తెల్సిందే. ఇప్పుడు ఈ మూవీ కి సీక్వెల్ గా" మేన్ హూనా 2" రాబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఈ చిత్రం అభివృద్ధి దశలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సీక్వెల్‌కు షారుఖ్ ఖాన్ తన అంగీకారం తెలిపినట్లు సమాచారం.

"మేన్ హూనా" చిత్రం రెడ్ చిల్లీస్ బ్యానర్‌లో వచ్చిన మొదటి సినిమా కావడంతో షారుఖ్ ఖాన్‌కు ఇది ఎంతో ప్రత్యేకం. కేవలం సీక్వెల్ కోసం సీక్వెల్ తీయాలనే ఉద్దేశంతో కాకుండా, ఫరా ఖాన్ చెప్పిన కథా విధానం అతనికి నచ్చినందునే ఈ ప్రాజెక్ట్‌పై ఆసక్తి చూపిస్తున్నట్లు సమాచారం.

తాజా సమాచారం ప్రకారం.. "ఫరా ఖాన్ 'మేన్ హూనా 2' కోసం ఒక కొత్త ఐడియా సిద్ధం చేశారు. ఈ కథను ఎలా తీసుకెళ్లాలో ఆమె ఆలోచన షారుఖ్‌కు ఎంతో నచ్చింది. ప్రస్తుతం ఆమె తన రచయితల బృందంతో కలిసి స్క్రీన్‌ప్లే తయారు చేస్తున్నారు. రెడ్ చిల్లీస్ టీమ్ కూడా ఈ ప్రక్రియలో భాగమైంది."

షారుఖ్ ఖాన్, ఫరా ఖాన్ టీమ్‌కు స్క్రీన్‌ప్లేను మరింత మెరుగుపరచాలని సూచించారని, 2025 నాటికి తొలి దశ స్క్రిప్ట్ సిద్ధం చేయాలని భావిస్తున్నారని సమాచారం. ప్రస్తుతం కథా రచన దశలోనే ఉంది. గతంలో వచ్చిన "మేన్ హూనా" చిత్రం ఫరా ఖాన్ దర్శకురాలిగా చేసిన తొలి సినిమా. ఇందులో షారుఖ్ ఖాన్‌తో పాటు సుష్మితా సెన్ కూడా ప్రధాన పాత్రలో నటించారు. "మేన్ హూనా 2"పై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

Tags

Next Story