మరింత బోల్డ్ అండ్ క్రేజీగా యానిమల్ పార్క్

బిగ్గెస్ట్ యాక్షన్ ఫిల్మ్ 'యానిమల్ పార్క్' కోసం అంతా రెడీ అవుతోంది. రణ్‌బీర్ కపూర్ తన బ్లాక్‌బస్టర్ 'యానిమల్' సీక్వెల్‌కి సిద్ధమవుతున్నాడు. ఈ కొత్త పార్ట్ పై మామూలు క్రేజ్ లేదు. 'యానిమల్' అల్టిమేట్ సక్సెస్ అయ్యాక.. స్టోరీ కంటిన్యూషన్ ఎలా ఉంటుందో అని ఆడియన్స్ చాలా ఈగర్‌గా చూస్తున్నారు. సినిమాకి తనదైన యూనిక్ టచ్, ఇంటెన్స్ ట్రీట్‌మెంట్ ఇచ్చిన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా మళ్లీ ఈ ప్రాజెక్ట్‌ని లీడ్ చేస్తున్నాడు.
రీసెంట్‌గా రణ్‌బీర్ 'యానిమల్ పార్క్' గురించి మాట్లాడుతూ.. ఈ మూవీ మొదటి దాని కంటే "మరింత భారీగా, మరింత బోల్డ్‌గా, మరింత క్రేజీగా ఉంటుందని చెప్పాడు. సీక్వెల్ లిమిట్స్ దాటి వెళ్తుందని, దాని స్కేల్ అండ్ స్టోరీ టెల్లింగ్ తో ఫ్యాన్స్‌ని షేక్ చేస్తుందని ఆయన యాడ్ చేశాడు. అయితే, ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లడానికి కొంత టైమ్ పడుతుందని కూడా రణ్‌బీర్ షేర్ చేసుకున్నాడు. ఎందుకంటే.. వంగా ప్రస్తుతం ప్రభాస్‌తో 'స్పిరిట్' మూవీ ఫినిష్ చేయడంలో బిజీగా ఉన్నాడు. ఆ ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాతే 'యానిమల్ పార్క్' ముందుకు వెళ్తుంది.
'యానిమల్' ఇండియన్ సినిమాలోనే హైయెస్ట్ గ్రాసర్స్ లో ఒకటి కాబట్టి, ఈ అనౌన్స్‌మెంట్ ఫ్యాన్స్‌లో భారీ ఎక్సైట్‌మెంట్ పెంచింది. రణ్‌బీర్ యాక్టింగ్, వంగా ఇంటెన్స్ నరేషన్ కలిసి దాన్ని ఎవర్‌గ్రీన్ చేశారు. మరింత డ్రామా, యాక్షన్, ఎమోషన్ ఉంటాయని ప్రామిస్ చేస్తున్న 'యానిమల్ పార్క్'.. ఒక బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ అవుతుందని అంచనా వేస్తున్నారు. ఈసారి రణ్‌బీర్-వంగా కాంబో ఎలాంటి వండర్ క్రియేట్ చేస్తుందో చూడాలని ఆడియన్స్ ఆతృతగా వెయిట్ చేస్తున్నారు.
-
Home
-
Menu