సల్మాన్ ‘సికందర్’ షూటింగ్ పూర్తి !

బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్, దర్శకుడు ఏఆర్ మురుగదాస్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ చిత్రం సికందర్. సాజిద్ నడియాడ్‌వాలా నిర్మిస్తున్న ఈ చిత్రం, ఈద్ 2025 సందర్బంగా థియేటర్లలో సందడి చేయనుంది. రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తుండగా, సత్యరాజ్, ప్రతీక్ బబ్బర్ ప్రతినాయక పాత్రల్లో కనిపించనున్నారు. 2024 జూన్‌లో ప్రారంభమైన ఈ సినిమా, ముంబై, హైదరాబాద్ సహా దేశంలోని పలు ప్రాంతాల్లో 90 రోజుల పాటు చిత్రీకరణ జరుపుకుంది.
చివరి షెడ్యూల్ ముంబైలోని ఓ ఫైవ్‌స్టార్ హోటల్‌లో పూర్తి అయ్యింది. మార్చి 14న చివరి రోజు షూటింగ్‌లో సల్మాన్ ఖాన్, రష్మిక మందన్నా, సాజిద్ నడియాడ్‌వాలా, ఏఆర్ మురుగదాస్ పాల్గొన్నారు. ఈ చివరి షెడ్యూల్‌లో బాంద్రాలో సల్మాన్, రష్మికలపై ప్యాచ్‌వర్క్ సన్నివేశాలు చిత్రీకరించాం. షూటింగ్ పూర్తి అయిన వెంటనే, సల్మాన్ తన పాత్ర కోసం పెంచుకున్న గడ్డాన్ని తీయించుకున్నారు. నిజజీవితంలో ఆయన క్లీన్‌షేవ్ లుక్‌ను ఎక్కువగా ఇష్టపడతారని చెబుతుంటారు.
సికందర్‌లో మొత్తం 4 పాటలు ఉండగా, అందులో 3 డ్యాన్స్ నంబర్స్.. 5 యాక్షన్ సన్నివేశాలు ఉంటాయని సమాచారం. మురుగదాస్ మాసివ్ స్టైల్‌లో తెరకెక్కిన ఈ సినిమాలో రొమాన్స్, పొలిటిక్స్, డ్రామా, రివెంజ్ అంశాలు మిళితమై ఉంటాయి. ఈ కథనం మొత్తం పవర్‌ఫుల్ యాక్షన్ బ్లాక్స్‌కు బలమైన బేస్‌ను అందిస్తాయి.. అని చిత్రబృందం తెలిపింది.
సినిమా ప్రిన్సిపల్ షూటింగ్ ఇప్పటికే జనవరిలో పూర్తి కాగా.. ఫిబ్రవరి, మార్చిలో కొన్ని ప్యాచ్‌వర్క్ సన్నివేశాలతో పాటు ప్రమోషనల్ సాంగ్ షూట్ చేశారు. ప్రస్తుతం ఎడిటింగ్ పూర్తి కాగా, కలర్ గ్రేడింగ్, విజువల్ ఎఫెక్ట్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ వంటి ఫినిషింగ్ టచ్‌లు జరుగుతున్నాయి. ఇంకా 5 రోజుల్లో ఫైనల్ ప్రింట్స్ రెడీ అవుతాయి, అప్పుడు థియేట్రికల్ రిలీజ్ కౌంట్‌డౌన్ మొదలవుతుంది.
-
Home
-
Menu