అమితాబ్ స్థానంలో సల్మాన్ ఖాన్ ?

అమితాబ్ స్థానంలో సల్మాన్ ఖాన్ ?
X
ఈ ఒప్పందం దాదాపు ఖరారైనట్టు సమాచారం. అయితే.. ఈ విషయంపై అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది. ఈ న్యూస్ ఇప్పటికే సినీ అభిమానుల్లో, టీవీ ప్రేక్షకుల్లో హాట్ టాపిగ్‌గా మారింది.

బాలీవుడ్‌ లో స్టార్ హీరో సల్మాన్ ఖాన్ క్రేజ్ ఎలాంటిదో తెలిసిందే. తాజా అప్‌డేట్ ప్రకారం, ఆయన ఇప్పుడు ఐకానిక్ టెలివిజన్ క్విజ్ షో ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ హోస్ట్‌గా లెజెండరీ నటుడు అమితాబ్ బచ్చన్ స్థానంలో అడుగు పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఈ విషయంలో ఛానల్ యాజమాన్యం సల్మాన్‌తో చర్చలు జరిపినట్టు తెలుస్తోంది. ఈ ఒప్పందం దాదాపు ఖరారైనట్టు సమాచారం. అయితే.. ఈ విషయంపై అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది. ఈ న్యూస్ ఇప్పటికే సినీ అభిమానుల్లో, టీవీ ప్రేక్షకుల్లో హాట్ టాపిగ్‌గా మారింది.

బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ 2007 లో కేబీసీ మూడవ సీజన్‌ను హోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆయన తనదైన శైలిలో ప్రేక్షకులను అలరించినప్పటికీ, అమితాబ్ బచ్చన్ ఈ షోకి ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చారు. ఆయన గంభీరమైన గొంతు, ప్రశాంతమైన వ్యక్తిత్వం, ప్రతి కంటెస్టెంట్‌తో సానుభూతితో కూడిన సంభాషణలు కేబీసీని భారతీయ టెలివిజన్ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిపాయి. ఇప్పుడు... సల్మాన్ ఖాన్ ఈ ప్రతిష్టాత్మక షోను హోస్ట్ చేయడానికి సిద్ధమవుతున్న నేపథ్యంలో ఆయన తన సహజమైన హాస్యం, చలాకీతనం, అభిమానులను ఆకర్షించే విశిష్టమైన శైలితో షోకి కొత్త ఊపు తీసుకొస్తారని అందరూ ఆశిస్తున్నారు.

సల్మాన్ ఖాన్, తన సినిమాలతో పాటు టెలివిజన్ రంగంలోనూ గట్టి ముద్ర వేశారు. ‘బిగ్ బాస్’ వంటి రియాలిటీ షోలను హోస్ట్ చేస్తూ ఆయన టీఆర్పీ రేటింగ్స్‌లో దూసుకెళ్లారు. ఆయన స్వాగ్, సరదా సంభాషణలు, ప్రేక్షకులతో కనెక్ట్ అయ్యే విధానం కేబీసీకి కొత్త రుచిని తీసుకొచ్చే అవకాశం ఉంది. అయితే, అమితాబ్ బచ్చన్ లాంటి దిగ్గజ నటుడి స్థానాన్ని భర్తీ చేయడం అంత సులభం కాదని అభిమానులు కూడా భావిస్తున్నారు.

Tags

Next Story