సల్మాన్ ఖాన్‌తో ‘అమరన్’ డైరెక్టర్ ?

సల్మాన్ ఖాన్‌తో ‘అమరన్’ డైరెక్టర్ ?
X
“ఈ ప్రాజెక్ట్‌పై ఇంకా అధికారికంగా ఏమీ ఖరారు కాలేదు. అయితే రాజ్‌కుమార్ పెరియసామి ఇప్పటికే సల్మాన్ ఖాన్ ప్రతినిధులతో పలుమార్లు సమావేశమయ్యారు.

షారుక్ ఖాన్, వరుణ్ ధావన్‌లతో అట్లీ.. అక్షయ్ కుమార్, ఆమిర్ ఖాన్, సల్మాన్ ఖాన్‌లతో ఏఆర్ మురుగదాస్ వర్క్ చేసినట్లు.. సౌత్ ఫిల్మ్ మేకర్స్ బాలీవుడ్ స్టార్స్‌తో ఉత్సాహభరితమైన క్రియేటివ్ కాంబోస్ ను నెలకొల్పుతున్నారు. ఇటీవలి కాలంలో ఇలాంటి కొత్త కలయికగా నిలుస్తున్నది సల్మాన్ ఖాన్, అమరన్ దర్శకుడు రాజ్‌కుమార్ పెరియసామి కలయిక. శివకార్తికేయన్, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో నటించిన తమిళ హిట్ ‘అమరన్’ చిత్రానికి రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వం వహించారని తెలిసిందే.

యుద్ధ నేపథ్యంలోని ఈ యాక్షన్ డ్రామా ఘనవిజయం సాధించడంతో.. ఇప్పుడు ఆయనకు సల్మాన్ ఖాన్ ఫిలింస్ సంస్థతో భేటీ అయ్యే అవకాశం లభించింది. తాజా సమాచారం ప్రకారం, “ఈ ప్రాజెక్ట్‌పై ఇంకా అధికారికంగా ఏమీ ఖరారు కాలేదు. అయితే రాజ్‌కుమార్ పెరియసామి ఇప్పటికే సల్మాన్ ఖాన్ ప్రతినిధులతో పలుమార్లు సమావేశమయ్యారు. అంతేగాక, తన కథను సల్మాన్‌కు నేరుగా వివరించి, స్క్రిప్ట్‌ను సమర్పించారు. కథ వినిన వారంతా సల్మాన్‌కి కథ నచ్చిందని చెబుతున్నారు. అయితే, సినిమా గురించి తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.”

‘అమరన్’ సినిమా కోసం రాజ్‌కుమార్ యాక్షన్ సన్నివేశాలను అద్భుతంగా రూపకల్పన చేయడమే కాకుండా.. వాటిలో సరైన భావోద్వేగాన్ని జోడించ డంలోనూ దిట్ట. ఈ నైపుణ్యం సల్మాన్ ఖాన్‌తో ఓ పవర్‌ఫుల్ యాక్షన్ మూవీ రూపొందించడానికి ఎంతో ఉపయోగపడనుంది. ప్రస్తుతం, సల్మాన్ ఖాన్ తన రాబోయే సినిమా సికందర్ పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ చిత్రానికి ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహిస్తుండగా, రష్మిక మందన్న, కాజల్ అగర్వాల్, ప్రతీక్ స్మితా పాటిల్, అంజిని ధావన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మరి సల్లూభాయ్ అమరన్ డైరెక్టర్ కు గ్రీన్ సిగ్నల్ ఇస్తాడో లేదో చూడాలి.

Tags

Next Story