ఫోకస్ అంతా ‘రామాయణం’ పైనే !

ఫోకస్ అంతా ‘రామాయణం’ పైనే !
X
సాధారణ కమర్షియల్ రోల్స్‌ను సున్నితంగా తిరస్కరిస్తూ.. తన కళాత్మక విలువలకు తగిన సినిమాలను ఎంచుకుంటూ, ఇండస్ట్రీలో ఒక యూనిక్ ట్రాక్‌ను క్రియేట్ చేస్తోంది.

సౌత్ ఇండస్ట్రీలో తనదైన గుర్తింపును సొంతం చేసుకున్న టాలెంటెడ్ హీరోయిన్ సాయి పల్లవి. సహజసిద్ధమైన నటన, గ్లామర్‌కు దూరంగా ఉండే పాత్రలతో అభిమానుల మనసు గెలుచుకుంది. ఆమె సాధారణ కమర్షియల్ రోల్స్‌ను సున్నితంగా తిరస్కరిస్తూ.. తన కళాత్మక విలువలకు తగిన సినిమాలను ఎంచుకుంటూ, ఇండస్ట్రీలో ఒక యూనిక్ ట్రాక్‌ను క్రియేట్ చేస్తోంది. ఆమె రా టాలెంట్, ఎక్స్‌ప్రెసివ్ యాక్టింగ్, అసాధారణ డ్యాన్సింగ్ స్కిల్స్ ఆమెను ప్రేక్షకుల హృదయాల్లో నిలిపాయి.

ఇప్పుడు ఈ క్వాలిటీస్ బాలీవుడ్ ఫిల్మ్‌మేకర్స్ దృష్టిని కూడా ఆకర్షించాయి. గ్లామరస్ నటీమణులను ఎంచుకోవడంలో ఫోకస్ చేసే ఇండస్ట్రీలో.. సాయి పల్లవి ఎంపిక పెర్ఫార్మెన్స్‌కు ప్రయారిటీ ఇచ్చే కొత్త కాస్టింగ్ ట్రెండ్‌ను హైలైట్ చేస్తోంది. అయితే.. ఎంతో హైప్ క్రియేట్ చేసిన “రామాయణం” లో సీతాదేవి పాత్రలో సాయి పల్లవి ఎంపిక కొంతమంది ఉత్తర భారత నెటిజన్ల నుండి తీవ్రమైన విమర్శల్ని ఎదుర్కొంది. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో కొందరు నెటిజన్లు ఆమె లుక్ ఈ ఐకానిక్ పాత్రకు సరిపోదని, ఈ ఎంపిక రామాయణం గౌరవాన్ని తగ్గిస్తోందని కామెంట్స్ చేశారు. సూర్పణఖ పాత్రలో నటిస్తున్నట్లు తెలిసిన రకుల్ ప్రీత్ సింగ్‌తో ఆమెను కంపేర్ చేస్తూ, కాస్టింగ్ ఛాయిసెస్ మిస్‌మ్యాచ్ అని విమర్శించారు.

రణబీర్ కపూర్ శ్రీరాముడిగా, యశ్ రావణుడిగా నటిస్తున్న ఈ ప్రాజెక్ట్, విజువల్‌గా స్టన్నింగ్‌గా ఉన్న ఒక గ్లింప్స్‌ను రిలీజ్ చేసిన తర్వాత, ఈ ట్రోలింగ్ మరింత ఊపందుకుంది. ఈ నెగెటివిటీ, ఆన్‌లైన్ ట్రోలింగ్‌ను పట్టించుకోకుండా, సాయి పల్లవి తన ఫోకస్‌ను “రామాయణం” ప్రాజెక్ట్‌పైనే ఉంచింది. ఆమె ఇప్పటికే మొదటి భాగం షూటింగ్‌ను కంప్లీట్ చేసి, రెండో భాగం కోసం ప్రిపేర్ అవుతోంది. ఈ ప్రాజెక్ట్ పట్ల ఆమె కమిట్‌మెంట్ అంతా ఇందులోనే ఉంది. దీని కారణంగా ఆమెకు ఇతర సినిమాల కోసం టైమ్ కేటాయించడం కుదరడం లేదు. ఆమె ఈ ప్రాజెక్ట్‌లో చూపిస్తున్న డెడికేషన్, ఆమెను ఒక ట్రెండ్‌సెట్టర్‌గా మరింత హైలైట్ చేస్తోంది.

Tags

Next Story