‘రేస్ 4’ లో ఈ హీరోలిద్దరూ పక్కా !

ప్రముఖ బాలీవుడ్ యాక్షన్-థ్రిల్లర్ ఫ్రాంచైజీ ‘రేస్’ నాలుగో భాగం ‘రేస్ 4’ గురించి ఉత్కంఠ నెలకొన్న నేపథ్యంలో టిప్స్ ఫిల్మ్స్‌కు చెందిన నిర్మాత రమేష్ తౌరానీ అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఈ సినిమాలో నటించబోయే తారాగణంపై వస్తున్న పుకార్లను ఖండిస్తూ.. ప్రస్తుతానికి కేవలం సైఫ్ అలీ ఖాన్ అండ్ సిద్ధార్థ్ మల్హోత్రాతో మాత్రమే చర్చలు జరుగుతున్నట్లు ఆయన స్పష్టం చేశారు.
ప్రస్తుతం ‘రేస్ 4’ స్క్రిప్టింగ్ దశలో ఉంది. ఈ దశలో సైఫ్ అలీ ఖాన్, సిద్ధార్థ్ మల్హోత్రా తప్ప ఇతర నటీనటులతో ఎలాంటి చర్చలు జరగలేదు. మీడియా అండ్ సోషల్ మీడియా పేజీలు అప్రమత్తంగా ఉండాలని.. అధికారిక సమాచారం కోసం మా పీఆర్ టీమ్ నుండి ప్రకటించబోయే ప్రకటనలకే విశ్వసించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం అని మేకర్స్ చెబుతున్నారు.
2008లో ప్రారంభమైన ‘రేస్’ సిరీస్ హై యాక్టేన్ యాక్షన్, స్టైలిష్ విజువల్స్, మలుపులతో కూడిన కథనంతో ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకుంది. ఇప్పటికే మూడు భాగాలు విజయవంతంగా తెరకెక్కిన ఈ ఫ్రాంచైజీకి నాలుగో భాగం కోసమే అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ‘రేస్ 4’ పూర్తిస్థాయి తారాగణం, షూటింగ్ వివరాల కోసం అధికారిక ప్రకటనలను వేచి చూడాల్సిన అవసరం ఉందని నిర్మాత తౌరానీ సూచించారు.
-
Home
-
Menu