శ్రీకృష్ణ దేవరాయలుగా రిషబ్ శెట్టి?

శ్రీ కృష్ణదేవరాయలు, విజయనగర సామ్రాజ్య చరిత్రలో కీలక పాత్ర పోషించిన ఒక లెజెండరీ రాజు. తెలుగు సంస్కృతిలో ఒక ఐకానిక్ వ్యక్తిగా నిలిచారు. ఆయన పాత్రను సినిమాల్లో చూసినప్పుడు, ముఖ్యంగా ‘ఆదిత్య 369’ లో నందమూరి బాలకృష్ణ గొప్ప హుందాతనంతో ఆ పాత్రను పోషించిన తీరు, ఇంకా ‘మహామంత్రి తిమ్మరుసు’ లో దివంగత నటుడు ఎన్టీఆర్ ఆ పాత్రకు జీవం పోసిన విధానం, ఇవన్నీ ఇప్పటికీ అందరి మదిలో మెదులుతాయి. అయితే, ఈ పాత్రను తిరిగి స్క్రీన్‌పై ఆవిష్కరించి చాలా కాలమైంది.
ఇప్పుడు కొత్త వార్తలు వినిపిస్తున్నాయి. ‘కాంతార’ స్టార్ రిషభ్ శెట్టి ఈ ఐతిహాసిక పాత్రలో నటించబోతున్నారని టాక్. విశ్వసనీయ సమాచారం ప్రకారం, లగాన్, జోధా అక్బర్ వంటి క్లాసిక్ సినిమాలకు పేరొందిన బాలీవుడ్ డైరెక్టర్ అశుతోష్ గోవారికర్ ఈ చిత్రం కోసం స్క్రిప్ట్ రాస్తున్నారట. చాలా కాలం విరామం తర్వాత గోవారికర్ ఈ భారీ ప్రాజెక్ట్‌తో తిరిగి రంగంలోకి దిగుతున్నారు, అందులో రిషభ్ శెట్టి శ్రీ కృష్ణదేవరాయల పాత్రలో కనిపించనున్నారని సమాచారం.
రిషభ్ శెట్టి కెరీర్ ‘కాంతార’ సినిమాతో ఊపందుకుంది. ఆ సినిమా సూపర్ హిట్ అయింది. ఇప్పుడు ఆయన తదుపరి చిత్రం ‘జై హనుమాన్’ కూడా భారీ బజ్ క్రియేట్ చేస్తోంది. అంతేకాదు, ఆయన ఒక పాన్-ఇండియా చిత్రంలో ‘ఛత్రపతి శివాజీ మహారాజ్’ పాత్రలో కూడా నటిస్తున్నారు. ఈ నేపథ్యంలో, శ్రీ కృష్ణదేవరాయల పాత్రలో రిషభ్ నటిస్తే, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటకల్లో ఈ సినిమా భారీ హైప్ సృష్టించడం ఖాయం.
-
Home
-
Menu