దీపావళి బరిలో రష్మికా హిందీ చిత్రం

అయుష్మాన్ ఖురానా, రష్మిక మందన్నా జంటగా నటిస్తున్న హర్రర్ కామెడీ "థామా". ఈ దీపావళికి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రకటించి నప్పటి నుండి విపరీతమైన క్రేజ్‌ను సంపాదించుకుంది. ప్రస్తుతం చివరి షెడ్యూల్ ముంబయిలో జరుగుతుండగా, మే చివరి నాటికి షూటింగ్ పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రారంభించేందుకు టీమ్ సిద్ధమవుతోంది. సినిమా విజువల్‌గా అద్భుతంగా కనిపించేలా భారీ స్థాయిలో పోస్ట్ ప్రొడక్షన్ పనులు చేపట్టనున్నారు. రష్మిక, అయుష్మాన్ ఇద్దరూ తమ పాత్రల్లో ఒదిగిపోవడానికి శ్రమిస్తున్నారు. ప్రస్తుతానికి ముంబయిలో షూటింగ్ శరవేగంగా జరుగుతోంది."
రష్మికకు ఈ సినిమా చాలా ప్రత్యేకమైనది. ఆమె ఇంతకుముందు హర్రర్ కామెడీ జానర్‌లో నటించలేదు. అయుష్మాన్‌తో ఆమె కెమిస్ట్రీ కూడా ప్రేక్షకులకు ఓ ప్రత్యేకమైన అనుభూతిని కలిగించబోతోంది. టీమ్ చాలా నమ్మకంతో ఉంది, సినిమా ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందిస్తుందని భావిస్తున్నారు. ఒకవైపు "థామా", మరోవైపు కార్తిక్ ఆర్యన్, శ్రీలీల జంటగా నటిస్తున్న అనురాగ్ బసు చిత్రం దీపావళికి థియేటర్లలో సందడి చేయనుంది. ఇటీవల విడుదలైన ఈ చిత్ర టీజర్ భారీ అంచనాలను ఏర్పరిచింది. కార్తిక్ గతంలో పండగ సీజన్లో హిట్ చిత్రాలు అందించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోసారి బాక్సాఫీస్‌ను షేక్ చేయడానికి సిద్ధమవుతున్నారు.
కార్తిక్, అనురాగ్ బసు కాంబినేషన్‌లో వస్తున్న ఈ చిత్రం పండగ బరిలోకి దిగుతుండడంతో దీపావళి బాక్సాఫీస్ పోటీ రసవత్తరంగా మారింది. రెండు సినిమాలూ విభిన్నమైన కాన్సెప్ట్‌లతో వస్తున్నాయి. ‘థామా’ కొత్తదనం కలిగిన జంటను చూపిస్తే.. కార్తిక్ ఆర్యన్ చిత్రం మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునే అవకాశం ఉంది. ‘థామా’ చిత్రాన్ని ఆదిత్య సర్పోత్దార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇది హర్రర్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కుతుండటంతో పాటు, థ్రిల్, ఎమోషన్, వినోదం అన్నీ మిళితమైన చిత్రంగా రూపొందుతోంది. రష్మికకు ఇది కొత్త తరహా ప్రాజెక్ట్ కాగా, అయుష్మాన్ తన స్వంత శైలిలో మరో విభిన్నమైన పాత్ర పోషిస్తున్నారు.
-
Home
-
Menu