
రష్మిక ‘థామా’ మూవీ విడుదల అప్పుడే !

నేషనల్ క్రష్ రష్మికా మందన్న తెలుగు, హిందీ చిత్రాలలో బిజీగా ఉంటూ పాన్-ఇండియన్ స్టార్‌గా తనని తాను ప్రూవ్ చేసుకుంది. ఈ సంవత్సరం ఆమె నుంచి ఇప్పటికే తెలుగులో “కుబేరా” వంటి చిత్రాలు విడుదలయ్యాయి. ఇంక 2025లో మరిన్ని హిందీ సినిమాలు వరుసలో ఉన్నాయి.
ఇప్పుడు రష్మిక మొట్టమొదటి హారర్ జానర్ చిత్రం.. “థామా” విడుదల తేదీ ఖరారైంది. ఈ చిత్రంలో ఆయుష్మాన్ ఖురానా , రష్మికా మందన్న జోడీగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్య పాత్రలో శ్రద్ధా కపూర్ నటిస్తోంది. హిందీలో విజయవంతమైన హారర్ థ్రిల్లర్‌లను అందించడంలో పేరుగాంచిన మడాక్ ఫిల్మ్స్ ఈ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తోంది.
“థామా” దీపావళి పండుగ సందర్భంగా అక్టోబర్ 21న థియేటర్లలో విడుదల కానుంది. ‘ఛావా, సికందర్’ చిత్రాల తర్వాత.. ఈ సంవత్సరం రష్మికా మందన్న నుంచి విడుదల కాబోతున్న మూడో హిందీ మూవీ ఇదే అవుతుంది. మరి ‘థామా’ మూవీ రష్మికా మందన్నకు ఏ రేంజ్ హట్టిస్తుందో చూడాలి.
-
Home
-
Menu